Jana Nayagan : దళపతి విజయ్ (Vijay) చివరి సినిమా ‘జననాయగన్’ (Jananayagan) ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ మూవీలో ఇప్పటికే పూజా హెగ్డే (Pooja Hegde)ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు మేకర్స్. కానీ తాజాగా ఆమెతో పాటు మరో హీరోయిన్ విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది అంటూ తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పైగా ఇది సినిమాకు లాస్ట్ మినిట్ చేంజ్ అంటున్నారు. మరి ఆ హీరోయిన్ ఎవరంటే?
‘జననాయగన్’లో మరో హీరోయిన్…
తమిళ దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వంలో దళపతి విజయ్ చివరగా నటిస్తున్న సినిమా ‘జననాయగన్’. ఈ సినిమాలో తాజాగా మేకర్స్ హీరోయిన్ ని ఫిక్స్ చేశారని అంటున్నారు. తాజాగా ఇందులో పూజాను హీరోయిన్ గా ఫిక్స్ చేయగా, మరో హీరోయిన్ ని ఒక క్యారెక్టర్ రోల్ కోసం తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. చివరి నిమిషంలో ఆమెను సినిమాలో చేర్చారని అంటున్నారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు శృతిహాసన్ (Shruthi Haasan). ప్రస్తుతానికి ఇవి కేవలం పుకార్లు మాత్రమే. మేకర్స్ ఇంకా ఈ వార్తలను ఖండించలేదు, అలాగని కన్ఫామ్ చేయలేదు.
పదేళ్ల తర్వాత జోడి రిపీట్
‘జననాయగన్’ సినిమాలో విజయ్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ ను శృతి హాసన్ దక్కించుకుంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు కానీ, ఒకవేళ ఈ వార్తలు గనక నిజమైతే ఈ జంట రిపీట్ కావడం దాదాపు పది ఏళ్ల తర్వాత జరుగుతుంది. 2015లో దళపతి విజయ్ తో శృతి కలిసి నటించిన ‘పులి’ సినిమా తర్వాత ఈ జంట రెండవసారి చేస్తున్న సినిమా ఇదే.
‘పులి’ మూవీ రాక్షసుడు పాలించే ఒక ఫాంటసీ మూవీ. ఇందులో మానవులు, రాక్షసుల మధ్య గొడవలు జరుగుతాయి. ఇందులో విజయ్ ప్రధాన పాత్రలో నటించగా, శృతిహాసన్ ఆయన భార్యగా కనిపించింది. అలాగే హన్సిక, శ్రీదేవి వంటి స్టార్స్ సైతం ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. కానీ ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. మరి రెండోసారి శృతిహాసన్ ఆయనతో జోడి కడితే ఫలితం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అప్పుడంటే శృతి డిజాస్టర్ల ఫేజ్ లో ఉంది. ఇప్పుడు మాత్రం ఈ బ్యూటీ అడుగు పెడితే హిట్టే అన్నట్టుగా ఉంది పరిస్థితి.
ఇదిలా ఉండగా విజయ్ చివరిసారిగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనే సినిమాలో కనిపించారు. ఈ యాక్షన్ డ్రామాలో ఆయన తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ‘జననాయగన్’ సినిమాలో విజయ్ చివరిసారిగా కనిపించబోతున్నాడు. రాజకీయం ప్రధాన అంశంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ తో పాటు బాబీ డియోల్, పూజా హెగ్డే, ప్రియమణిఇంకా చాలా మంది ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. మరోవైపు శృతిహాసన్ రజినీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపొందుతున్న ‘కూలీ’లో కనిపించబోతోంది.