BigTV English

Thalapathy69: విజయ్ చివరి సినిమా.. బాలయ్య హిట్ సినిమాకు రీమేక్ అని మీకు తెలుసా.. ?

Thalapathy69: విజయ్ చివరి సినిమా.. బాలయ్య హిట్ సినిమాకు రీమేక్  అని మీకు తెలుసా.. ?

Thalapathy69: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయ ఎంట్రీకి రంగం సిద్దమైన విషయం తెల్సిందే. ఇప్పటికే పార్టీ పేరును ప్రకటించిన విజయ్.. తాను సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ మధ్య రిలీజ్ అయిన ది గోట్ నే విజయ్ చివరి చిత్రమని  పుకార్లు వచ్చాయి. కానీ, ది గోట్ తరువాత విజయ్ మరో సినిమా చేస్తున్నాడని, అదే చివరి చిత్రమని అధికారిక ప్రకటన వచ్చింది. ఆ చిత్రమే దళపతి69. హెచ్. వినోత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.


ఇక ఈ సినిమాకు సంబంధించిన స్టార్ క్యాస్టింగ్ ను మేకర్స్ అధికారికంగా రివీల్ చేసున్నారు. ఇప్పటికే విజయ్ కు విలన్ గా అనిమల్ ఫేమ్ బాబీ డియోల్ ను దింపారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం  ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమితా బైజు, పూజా హెగ్డే, ప్రియమణి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదంతా పక్కన పెడితే.. ఈ సినిమా టాలీవుడ్ లో హిట్ అయిన భగవంత్ కేసరికి రీమేక్ గా తెరకెక్కుతోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో  తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో శ్రీలీల, కాజల్ అగర్వాల్  హీరోయిన్స్ గా నటించారు.  భగవంత్ కేసరి మంచి కలక్షన్స్ తో పాటు ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. ఈ చిత్రంలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తో పాటు ఆడపిల్లను పేరెంట్స్ ఎలా పెంచాలో చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు విజయ్ పాలిటిక్స్ లోకి అడుగుపెడుతున్నారు. ఇలాంటి  మెసేజ్  ఓరియెంటెడ్ సినిమా పడితే.. ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఏర్పడే ఛాన్స్ ఉండొచ్చని విజయ్ ఈ రీమేక్ ను ఓకే చేసినట్లు సమాచారం.


బాలయ్య పాత్రను విజయ్ చేస్తుండగా.. శ్రీలీల పాత్రలో మమితా కనిపించనుందట. భగవంత్ కేసరిలో బాలయ్య- శ్రీలీల తండ్రికూతుళ్ళగా కనిపించగా.. వయస్సు రీత్యా ఈ కథను అన్నా చెల్లెళ్ళ మధ్య నడిచే కథగా మార్చినట్లు తెలుస్తోంది. ఇక  కాజల్ పాత్రలో పూజ హెగ్డే కనిపిస్తుందని, బాలయ్యకు ధీటుగా విలనిజం పండించిన అర్జున్ రాంపాల్ పాత్రను బాబీ డియోల్ చేస్తున్నట్లు సమాచారం. కోలీవుడ్ కు తగ్గట్టు ఈ కథను మార్చి హెచ్ వినోత్ ప్రజెంట్ చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే విజయ్ కు రీమేక్స్ కొత్తేమి కాదు.

నిజం చెప్పాలంటే అసలు విజయ్ ను నిలబెట్టిందే తెలుగు రీమేక్స్. ఒక్కడు, ఖుషి, నువ్వు నాకు నచ్చావ్.. ఇలా చెప్పుకుంటూపోతే విజయ్ హిట్స్ అందుకున్న సినిమాలు అన్ని రీమేక్సే. దీంతో విజయ్ చివరి చిత్రం కూడా రీమేక్ అవ్వడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో విజయ్ ఒక మంచి హిట్ ను అందుకున్నట్లు దాఖలాలు లేవు. వారసుడు, లియో, ది గోట్ .. వరుసగా పరాజయాలనే చవిచూశాడు. మరి ఈ చివరి చిత్రం కూడా కొత్త కథతో వెళ్తే పరాజయాన్ని అందుకోక తప్పదేమో అన్న భయంతో అతనికి కలివచ్చిన  రీమేక్ నే నమ్ముకున్నాడు అని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×