Thaman : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో తమన్ ఒకరు. కిక్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంగీత దర్శకుడుగా పరిచయం అయ్యాడు తమన్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ముఖ్యంగా ఈ పాటలు అందరిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒకసారి కొత్త సంగీత దర్శకుడు దొరికాడు అని చాలామంది అనుకున్నారు. అయితే తమన్ ను చూసిన వెంటనే చాలామంది దర్శకులకు అప్పటికే తమన్ పరిచయం ఉంది. దీని కారణం మణిశర్మ దగ్గర కొన్నేళ్లపాటు తమన్ పనిచేయడమే. తమన్ ను సంగీత దర్శకుడుగా పరిచయం చేయడానికి చాలామంది ప్రయత్నించారు కానీ ఆ అవకాశం కేవలం సురేందర్ రెడ్డికి మాత్రమే దక్కింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
తమన్ దూకుడు
ఒక టైం లో ఒకేసారి తమన్ పది సినిమాలు కంపోజ్ చేసిన స్థాయికి కూడా వెళ్లిపోయాడు. ఎప్పుడు మొదలై ఎప్పుడు పూర్తి అయిపోయాయి కూడా తెలియని స్థాయిలో తమన్ మ్యూజిక్ రిలీజ్ అవుతూ ఉండేది. సడన్ గా యాభై సినిమాలు అయిపోయాయి. ఇకపోతే తమన్ కి మంచి పేరు తీసుకొచ్చిన సినిమా అప్పట్లో దూకుడు. మహేష్ బాబు నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించింది. శ్రీను వైట్ల కెరియర్ లో కూడా ఈ సినిమా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది. ఈ సినిమా తర్వాత కూడా మహేష్ బాబుతో బిజినెస్ మెన్ సినిమాకి పనిచేసే అవకాశం తమన్ కి దక్కింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్గా ఈ సినిమా రీ రిలీజ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
కేవలం 12 నిమిషాల్లో పాట
కొన్నిసార్లు ఒక్కో పాటను కంపోజ్ చేయడానికి రోజులు గడుస్తూ ఉంటాయి. కానీ బిజినెస్ మెన్ సినిమాలో బాగా పాపులర్ అయిన సారొస్తారా పాటను కేవలం 10 నుంచి 12 నిమిషాల్లోనే పూర్తి చేశాడట. గోవాలో పూరి జగన్నాథ్ తో మాట్లాడుతూ సినిమా అంతా ఆటిట్యూడ్ తో వెళ్లే సాంగ్స్ ఉన్నాయి. మహేష్ బాబుకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది మనం ఒక పాటను పెట్టాలి అన్నప్పుడు. సరే మీరు రూమ్ కి వెళ్ళండి నేను వస్తాను అని లిరిక్ రైటర్ భాస్కర్ భట్లను, తమన్ ను పంపించారట పూరి జగన్నాథ్. తమన్ ఒక ట్యూన్ చెప్పగానే వెంటనే భాస్కర్ పట్ల సారొస్తారా అని రాశారట, అయితే ఈ పాట పూరి జగన్నాథ్ కి కూడా బాగా నచ్చింది. రాంగోపాల్ వర్మ ఈ పాటకు పెద్దగా రెస్పాండ్ కాలేదు. దూకుడు సినిమా 100 రోజులు ఫంక్షన్ లో ఈ పాటను ప్లే చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఈ పాట సినిమాలో కూడా బాగా పాపులర్ అయింది.
Also Read : NTR birthday treat : ఎన్టీఆర్ బర్త్డేకు రీ రిలీజ్ చేసే సినిమా ఇదే