NTR birthday treat : ప్రతి హీరో కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉంటాయి. ఎన్ని రోజులైనా కూడా ఆ సినిమాలకి క్రేజ్ అదే రేంజ్ లో ఉంటుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ కెరియర్ లో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో మొదలైన వీరి ప్రయాణం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సక్సెస్ లు ఇచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి సినిమా ఎంత కమర్షియల్ గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. రీసెంట్ గా ఈ సినిమాను రీ రిలీజ్ చేసినప్పుడు ప్రేక్షకులు కూడా విపరీతంగా ఎంజాయ్ చేశారు. సింహాద్రి సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా యమదొంగ. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కూడా మంచి ఫలితాన్ని రాబట్టుకుంది.
చాలామందికి ఫేవరెట్
ఎన్టీఆర్ చేసే సినిమాల్లో చాలామందికి ఇష్టమైన సినిమా యమదొంగ. ఈ సినిమాలో రాజమౌళి తారక్ ను చూపించిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అలానే తారక్ లోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని కూడా బాగానే బయటికి తీసింది. ముఖ్యంగా చనిపోయిన తర్వాత స్వర్గంలో స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారిని కలవడం అప్పట్లో ప్రేక్షకులకి విపరీతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇక ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఆ సినిమాను మరోసారి రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఆ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ అప్పట్లో బాగా పాపులర్ అయ్యాయి. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో లో కూడా ఎన్టీఆర్ ఈ డైలాగులు చెప్పి అందర్నీ మెప్పించారు. ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతమందించారు. ముఖ్యంగా ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ ఒక మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తుంది.
రీ రిలీజ్ ట్రెండ్
ప్రతి హీరో బర్త్ డే కి సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ చేయడం అనేది ట్రెండ్ గా మారింది. మహేష్ బాబు ఒక్కడు సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ పవన్ కళ్యాణ్ జల్సా సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కేవలం స్టార్ హీరోల సినిమాలు మాత్రమే కాకుండా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను కూడా రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. అయితే అన్ని సినిమాలకు సరైన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాకి మాత్రం అప్పుడు డిజాస్టర్ అయినా కూడా ఇప్పుడు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇక ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తారు అని వార్తలు వినిపిస్తున్న యమదొంగ సినిమాను ఏ మేరకు ప్రేక్షకులు ఆదరిస్తారు వేచి చూడాలి.
Also Read : OG : ఓ జి సినిమాలో ఆ స్టార్ హీరో సాంగ్ పాడారు, రిలీజ్ ఎప్పుడంటే.?