Aditi Govitrikar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా గుర్తుందా.. ? అని అడగకూడదు. ఆ సినిమాను మర్చిపోయేది ఎవరు.. ఇక ఆ సినిమాలో వయ్యారి భామ.. నీ హంస నడక అంటూ.. ఒక చిన్నది .. పవన్ మనసును కొల్లగొడుతుంది. ఎవరు ఫోన్ లో.. ఎవరో లవ్లీ అమ్మగారు అంట అయ్యగారు.. అని పవన్ బాస్ గా, పనివాడుగా మాట్లాడే సీన్ ను అయితే అస్సలు మర్చిపోరు.
ఓ.. లవ్లీ పాప.. మాకు గుర్తుంది అని అంటారా.. ? ఓకే ఓకే.. ఇప్పుడు ఆ లవ్లీ పాప గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె పేరు అదితి గోవత్రికర్. పిల్లి కళ్లతో సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచింది అదితి. తమ్ముడు సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత అమ్మడి రేంజ్ మారిపోతుంది అనుకున్నారు అంతా.. కానీ, అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి అన్నట్లు.. ఆ ఒక్క సినిమా తరువాత ఈ చిన్నది ఏ సినిమాలో కూడా కనిపించలేదు.
Jayam Ravi: భార్యకు విడాకులు.. షాక్ ఇచ్చిన కోర్టు
అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. అప్పట్లో అమ్మడి ఫోకస్ అంతా బాలీవుడ్ మీదనే ఉండేదట. అందుకే టాలీవుడ్ ను లైట్ తీసుకొని బాలీవుడ్ లో మకాం పెట్టింది. అక్కడ అరకొర సినిమాలకే పరిమితమయ్యింది. అక్కడనుంచి కూడా కొన్నేళ్ళకు కనుమరుగయ్యింది. ఎక్కడికి వెళ్ళింది.. ? ఏమైపోయింది.. ?అనేది కూడా ఎవరికి తెలియలేదు.
ఇక దాదాపు పాతికేళ్ల తరువాత.. ఇదిగో ఈ వయ్యారి భామ ఇలా తిరుపతిలో ప్రత్యక్షమయ్యింది. తాజాగా అదితి శ్రీవారి సేవ చేస్తూ కనిపించింది. స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంది. ఆమెను గుర్తుపట్టిన కొందరు పవన్ హీరోయిన్ అని కెమెరాలు క్లిక్ మనిపించారు.
Singer Anurag Kulakarni: సీక్రెట్ గా ఆ సింగర్ ను పెళ్లి చేసుకున్న అనురాగ్ కులకర్ణి.. ?
అప్పటికీ ఇప్పటికీ అదితిలో చాలా మార్పులు వచ్చాయి. వయస్సు పెరగడంతో వచ్చిన ముడతలు, కొంచెం బరువు పెరిగినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ అందరూ రీఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. మరి ఈ చిన్నది కూడా ముందు ముందు రీఎంట్రీ ఏమైనా ప్లాన్ చేస్తుందేమో చూడాలి.