IND vs SA 4th T20i: టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టి20 మ్యాచ్లో తిలక్ వర్మ అలాగే సంజు అదరగొట్టారు. ఇద్దరూ తమ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. 51 బంతులు ఆడిన సంజు 100 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్ లు ఉంటే ఎనిమిది సిక్సులు ఉన్నాయి.
Also Read: Shikhar Dhawan – NPL 2024: ఐపీఎల్ కు గుడ్ బై..నేపాల్ కు వెళ్లిపోతున్న శిఖర్ ధావన్ ?
Also Read: Arjun Tendulkar: భయంకరమైన బౌలింగ్ తో రెచ్చిపోయిన సచిన్ కొడుకు..వేలంలో భారీ ధర పక్కా !
ఇక తిలక్ వర్మ 41 బంతుల్లో తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో తొమ్మిది సిక్సులు, 6 ఫోర్ లు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ లో 20 ఓవర్లు ఆడిన టీమిండియా… ఒకే ఒక్క వికెట్ కోల్పోయి 283 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో… మొదట టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన.. ఆది నుంచి దుమ్ము లేపింది. దీంతో 283 పరుగులు చేయగలిగింది. అభిషేక్ శర్మ ఒక్కడు 36 పరుగులకు అవుట్ కాగా తిలక్ వర్మ అలాగే సంజు ఇద్దరు సెంచరీలు చేసి దుమ్ము లేపారు. ఇక 284 పరుగులు పరుగులు చేస్తేనే సౌతాఫ్రికా విజయం సాధిస్తుంది.