Tharun Bhascker : ప్రముఖ తెలుగు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar), తాజాగా పాపులర్ యూట్యూబర్ అన్వేష్ తో కలిసి ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అందులో ఆయన ఆటగాడివే అంటూ అన్వేష్ పై పంచ్ వేయడం, అన్వేష్ తిరిగి సరదాగా కౌంటర్ వేయడం ఆసక్తికరంగా మారింది.
టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్స్ లో తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) కూడా ఒకరు. మరోవైపు తెలుగు యూట్యూబర్ అన్వేష్ కి కూడా క్రేజీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ‘నా అన్వేషణ’ పేరుతో ఈ ప్రపంచ యాత్రికుడు ప్రపంచ దేశాలు తిరుగుతూ, అక్కడి ఫుడ్ ని కల్చర్ ని తెలుగు వారికి పరిచయం చేస్తూ ఉంటారు. ఇక వీటన్నింటి కంటే ఆయన మాట్లాడే భాష, యాసే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తుంది. కామెడీగా మాట్లాడుతూనే చెప్పాల్సిన విషయాన్ని చెప్తాడు అన్వేష్.
అయితే తాజాగా ఎయిర్ పోర్ట్ లో తీసిన వీడియోలో తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) ని అన్వేష్ కలవడం కనిపించింది. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ “నేనే మీ ఫ్యాన్ లాగా వచ్చాను. నేనే మీతో ఫోటో అడిగి తీసుకున్నాను కదా? నేను మీకు పెద్ద ఫ్యాన్. మీ వర్క్ అంటే చాలా ఇష్టం. అసలే మనోడు పెద్ద ఆటగాడు” అంటూ తరుణ్ భాస్కర్ పంచ్ వేయడంతో… “ఇదంతా యాదృచ్ఛికంగా జరిగింది.. మీ సినిమాలు చాలా బాగుంటాయి”అంటూ నవ్వుతూ సమాధానం చెప్పాడు అన్వేష్. ఇక “ఇద్దరం ఆటగాళ్ళం థాయిలాండ్ వచ్చాం” అంటూ అతను సరదాగా కామెంట్ చేశాడు. మొత్తానికి అన్వేష్ తరుణ్ భాస్కర్ కలిసి ఉన్న ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
అన్వేష్ పేరుకే యూట్యూబర్. అతనితో సెలబ్రిటీ సైతం ప్రమోషన్లు చేయడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. కొన్నాళ్ళ క్రితం యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అన్వేష్ ని ఇమిటేట్ చేస్తూ, ఓ వీడియో చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. దానికి అన్వేష్ రిప్లై కూడా ఇచ్చాడు. అలాగే గెటప్ శ్రీను లాంటి పలువురు ఆర్టిస్టులు తమ సినిమాలను ప్రమోట్ చేయించారు. ఇలా యూట్యూబ్ ప్రపంచంలో ప్రపంచ యాత్రికుడిగా ఎదుగుతున్న ఈ ప్రపంచ యాత్రికుడి క్రేజ్ ను సెలబ్రిటీల సైతం వాడుకుంటూ, సినిమా ప్రపంచానికి కూడా దగ్గర చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) ఇప్పుడు థాయిలాండ్ కి ఎందుకు వెళ్లారు అనేది తెలియాల్సి ఉంది. దర్శకత్వంతో పాటు యాక్టర్ గా కూడా రాణిస్తున్న తరుణ్ భాస్కర్ చివరిసారిగా ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘కీడా కోలా’ (Keedaa Cola) అనే సినిమాలో కనిపించారు. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ మలయాళీ హిట్ మూవీ ‘జయ జయ జయహే’ తెలుగు రీమేక్ లో లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా కు ‘ఓం శాంతి శాంతి’ (Om Shanthi Shanthi) అనే టైటిల్ ని పెట్టారు.