Nithyamenon:సౌత్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో నిత్యామీనన్ (Nithyamenon) కూడా ఒకరు.. పొట్టి పిల్లైనా గట్టి పిల్ల అన్నట్టు హైట్ తక్కువే అయినప్పటికీ నిత్యామీనన్ తన యాక్టింగ్ తో అందర్నీ ఆకట్టుకుంటుంది. నిత్యా మీనన్ తన యాక్టింగ్ తో నేషనల్ అవార్డులు సైతం అందుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ గతంలో తమిళనాడు తలైవి జయలలిత (Jayalalitha) బయోపిక్ చేస్తున్నట్టు ప్రకటించి, పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. జయలలిత బయోపిక్ లో నిత్యమీనన్ “ది ఐరన్ లేడీ” అనే బయోపిక్ తీస్తున్నట్టు కూడా ప్రకటించారు చిత్ర యూనిట్. కానీ సడన్ గా ఈ సినిమా ఆగిపోయింది. మరి జయలలిత బయోపిక్ లో నటించాల్సిన నిత్య మీనన్ ఎందుకు వెనకడుగు వేసింది? ఈ సినిమా ఆగిపోవడానికి కారణం ఆ హీరోయినేనా..? తండ్రి చెప్పినా కూడా వినకుండా నిత్యమీనన్ ఎందుకు ఈ సినిమాలో నటించలేదు? అనేది ఇప్పుడు చూద్దాం..
నిత్యామీనన్ నటనకు ఫిదా అయిన ఎన్టీఆర్..
సౌత్ సినిమాలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ లో నిత్యామీనన్ ఒకరు. ఈమె తన అందం, అభినయంతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. కేవలం సామాన్య జనాలే కాదు హీరోలలో కూడా నిత్య మీనన్ యాక్టింగ్ కి అభిమానులు ఉన్నారు. అలాంటి వారిలో సౌత్ హీరో ఎన్టీఆర్ (NTR) కూడా ఉన్నారు. నిత్యమీనన్ ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ సినిమాలో నటించినప్పుడు, ఆమె యాక్టింగ్ చూసి ఎన్టీఆర్ సైతం ఆశ్చర్యపోయారట.
జయలలిత బయోపిక్ లో అందుకే నటించలేదు…
ఈ విషయం పక్కన పెడితే.. గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి హీరోయిన్ అయినటువంటి జయలలిత బయోపిక్ లో నిత్య మీనన్ నటిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. యంగ్ దర్శకురాలు అయినటువంటి ప్రియదర్శి (Priyadarshi) దర్శకత్వంలో జయలలిత ది ఐరన్ లేడీ బయోపిక్ లో నిత్యామీనన్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కాని సడన్గా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే ఈ ప్రాజెక్టు ఆగిపోవడానికి కారణం ఏంటో నిత్యమీనన్ ఓ ఇంటర్వ్యూలో చెబుతూ..” జయలలిత గారి లాంటి బయోపిక్ లో అవకాశం రావడం ఒక అదృష్టం. అయితే ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు నేను చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యి ఎన్నో చర్చల తర్వాత సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఈ సినిమాకి తలైవి అనే టైటిల్ తో కంగనా రనౌత్ (Kangana Ranaut) ఆల్రెడీ జయలలిత గారి బయోపిక్ లో నటించింది. మళ్ళీ అదే టైటిల్ తో సినిమా చేస్తే ఎలా ఉంటుంది.. బాగోదు అని, ఆ టైటిల్ పక్కన పెట్టి ‘ది ఐరన్ లేడీ’అనే టైటిల్ తీసుకుందాం అనుకున్నాం. కానీ అప్పటికే జయలలిత గారి బయోపిక్ లో కంగనా రనౌత్ ఆల్రెడీ నటించేసింది.అలాగే జయలలిత గారి మీద క్వీన్ అనే మరో వెబ్ సిరీస్ కూడా వచ్చింది.ఇలా ఇప్పటికే జయలలిత గారి మీద రెండు బయోపిక్ లు వచ్చాక మళ్ళీ ది ఐరన్ లేడీ అనే బయోపిక్ తో వస్తే ఏం బాగుంటుంది.. ఆల్రెడీ రెండు బయోపిక్ లు వచ్చాక మళ్లీ మేము అదే బయోపిక్ తో రావడం వృధా అనుకొని ఆ సినిమాని పక్కన పెట్టేసాం.. అయితే ఈ సినిమాని పక్కన పెట్టిన సమయంలో మా నాన్న మాత్రం ఎందుకు నువ్వు ఆ సినిమా చేయడం లేదు. అందులో నువ్వు బాగా సెట్ అయ్యావు ఖచ్చితంగా బయోపిక్ లో నటించాల్సిందే అని చెప్పారు. కానీ మా నాన్నకు అసలు విషయం చెప్పి మళ్లీ తీస్తే బాగుండదు అని చెప్పడంతో ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. అలా జయ లలిత గారి బయోపిక్ లు ఇప్పటికే రెండు రావడం కారణంగా మా సినిమా మూలన పడింది” అంటూ నిత్యామీనన్ తాజాగా చెప్పుకొచ్చింది. ఏది ఏమైనప్పటికీ నిత్యమీనన్ ఫ్యాన్స్ మాత్రం జయలలిత బయోపిక్ ని మీరు మరో విధంగా తెరకెక్కించి ఉంటే బాగుండేది.కచ్చితంగా సినిమా హిట్ అయ్యేది కదా అని కోరుకుంటున్నారు. ఇక నిత్యమీనన్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ఈ హీరోయిన్ ధనుష్ (Dhanush) తో కలిసి ‘ఇడ్లీ కడై’మూవీలో చేస్తుంది.