BigTV English
Advertisement

Manchu Vishnu : ఇంకా ఓటిటి డీల్ క్లోజ్ కాలేదు, మరీ రిస్క్ లో పడుతున్నాడా.

Manchu Vishnu : ఇంకా ఓటిటి డీల్ క్లోజ్ కాలేదు, మరీ రిస్క్ లో పడుతున్నాడా.

Manchu Vishnu : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమాలలో కన్నప్ప ఒకటి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద స్టార్ నటులంతా కూడా ఈ సినిమాలో కనిపిస్తున్నారు. వీటన్నిటిని మించి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక కీలక పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తుండడంతో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేశారు. ప్రస్తుతం చాలామంది దర్శక నిర్మాతలు సినిమా మొదలు పెడుతున్న తరుణంలోని ఓటిటి డీల్స్ మాట్లాడుతూ ఉంటారు. చాలా సినిమాలు పూర్తవకముందే ఓటిటి లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా క్లారిటీతో ఉంటారు. అయితే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన కన్నప్ప సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఓటిటి డీల్ ఫినిష్ కాలేదు.


ఓటిటి డీల్ క్లోజ్ కాలేదు

ఒకప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత దాదాపు 50 వంద రోజులు పోయిన తర్వాత ఆ సినిమాకు సంబంధించిన ఒరిజినల్ ప్రింట్ సిడి రూపంలో వచ్చేది. ఆ తర్వాత కాలంలో సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే టీవీల్లో ప్రత్యక్షమయ్యేది. ఓటిటి వచ్చిన తర్వాత కేవలం నెలరోజుల్లోపే అన్ని సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేసేవి. అయితే ఇప్పటికీ ఇంకా కన్నప్ప సినిమాకు సంబంధించి ఓటీటీ డీల్ క్లోజ్ కాలేదు, దీనిపై మంచి విష్ణు మాట్లాడుతూ “వాళ్ళు ఒక ఫిగర్ చెప్పారు నాకు అది నచ్చలేదు. హిట్ అయ్యాక అమ్మితే ఎంత ఇస్తారు అన్నాను..అప్పుడు వాళ్ళు చెప్పిన ఫిగర్ నాకు నచ్చింది. అమౌంట్ రెడీ చేసుకోండి విడుదల అయ్యాక వస్తా అని చెప్పాను” ఒకవేళ సినిమా హిట్ అయిన తర్వాత మంచి కలెక్షన్స్ వస్తే పర్వాలేదు. కానీ ఏమైనా తేడా జరిగింది అంటే మరోవైపు ఉన్నది కూడా ఊడిపోయే పరిస్థితి అని చెప్పాలి.


మరోవైపు వ్యతిరేకత 

అయితే ఈ సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతున్న తరుణంలో మరోవైపు ఈ సినిమాను బ్యాన్ చేయాలి అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. దీనికి కారణం ఈ సినిమాలోని పిలక గిలక అనే రెండు పాత్రలను పెట్టడం. గుంటూరులోని బ్రాహ్మణ సంఘాలు గతంలో దేనికైనా రెడీ సినిమాలో కూడా ఇలానే బ్రాహ్మణులను విమర్శించారు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు ఈ సినిమాను బాయికాట్ చేయాలి అంటూ పిలుపు ఇస్తున్నారు. అయితే ఈ పరిస్థితులన్నీ అధిగమించి సినిమా ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది ఇంకొన్ని రోజుల్లో తెలియాల్సి ఉంది.

Also Read : The Raja Saab : రాజా సాబ్ గురించి మారుతి మొదటిసారి నోరు విప్పాడు, హైప్ అలా పెంచాడు.!

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×