Shashank Singh : ఐపీఎల్ 2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన ఆటతో అందరినీ ఆకట్టుకుంది. ప్రధానంగా ఫైనల్ లో కూడా చివరి వరకు ఉత్కంఠగా సాగింది. ఎట్టకేలకు ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరోవైపు లీగ్ దశలో మాత్రం పాయింట్ల పట్టిక లో అగ్రస్థానంలో నిలిచింది పంజాబ్ కింగ్స్. తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో బెంగళూరు చేతిలో ఓడిపోయింది. ఆ తరువాత కీలకమైన రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో మాత్రం ముంబై ఇండియన్స్ మట్టికరిపించింది. దీంతో ఫైనల్ కి వచ్చిన పంజాబ్ విజయం సాధించిందని అంతా భావించారు. బ్యాటింగ్ లో చివరి మూడు ఓవర్లలో మ్యాచ్ మారిపోయింది. బెంగళూరు బౌలర్లు వికెట్లు తీయడం.. కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో టార్గెట్ ఛేదించడం కష్టంగా మారింది. ఇదిలా ఉంటే.. ముంబై తో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ తన సహచర ఆటగాడు శశాంక్ సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Also Read : Shahid Afridi : కుక్క చావు చచ్చిన షాహిద్ అఫ్రిది…? అసలు నిజం ఇదే
ముఖ్యంగా కీలక సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి శశాంక్ రనౌట్ కావడంతో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సీరియస్ అయ్యాడు. మ్యాచ్ విజయం సాధించిన తరువాత కూడా శశాంక్ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించగా.. అయ్యర్ అతని వైపు కోపంగా చూసి ఏదో అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ విషయం పై ఓ ఇంటర్వ్యూలో శశాంక్ స్పందించాడు. ముంబై తో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో ఘోర తప్పిందం చేశానని ఒప్పుకున్నాడు. ఆ సమయంలో తాను చేసిన తప్పునకు శ్రేయస్ నన్ను కొట్టాల్సింది. మా నాన్న కూడా ఫైనల్ మ్యాచ్ వరకు నాతో మాట్లాడలేదు. తాను క్యాజువల్ గా బీచ్ లో నడిచినట్టు వెళ్లాను. ఇది చాలా కీలక సమయం.. నీ నుంచి ఇది అస్సలు ఊహించలేదని శ్రేయస్ తనతో అన్నాడు.
కీలక సమయంలో నేను అలా ఔట్ కాకూడదని.. అప్పుడు తిట్టినా ఆ తరువాత శ్రేయస్ తనను డిన్నర్ కి తీసుకెళ్లినట్టు చెప్పుకొచ్చాడు. మరోవైపు ప్రస్తుతం టీ-20 క్రికెట్ లో శ్రేయాస్ అయ్యర్ కి మించిన కెప్టెన్ లేడని.. అతను ఆటగాళ్లకు చాలా స్వేచ్ఛను ఇస్తాడని తెలిపాడు. అందరినీ సమానం చూస్తాడని.. శ్రేయాస్ అటిట్యూడ్ చూపిస్తాడని ఎవ్వరూ అనరు. డ్రెస్సింగ్ రూమ్ లో యువ ఆటగాళ్లతో చాలా సరదాగా ఉంటాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు సరైన సలహా ఇస్తే.. స్వీకరిస్తాడు. ఇలాంటి కెప్టెన్లు ఉండటం చాలా అరుదు అని వివరించాడు. క్వాలిఫయర్ 2లో అలా వ్యవహరించినప్పటికీ.. ఫైనల్ లో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు శశాంక్ సింగ్. 30 బంతుల్లో 61 పరుగులు చేశాడు. చివరి ఓవర్ లో 29 పరుగులు చేయాల్సి ఉండగా.. 24 పరుగులు చేసి గెలుపుకి చేరువకి తీసుకొచ్చాడు. ఇంకా ఒకటి లేదా రెండు బంతులు మిగిలి ఉంటే.. కచ్చితంగా పంజాబ్ విజయం సాధించేది అని అభిమానులు పేర్కొనడం విశేషం.