BigTV English

Spirit : ‘స్పిరిట్’ షూటింగ్ మరింత ఆలస్యం… ప్రాజెక్ట్ ఇన్ని నెలలు లేట్ అవ్వడానికి ప్రభాసే కారణమా ?

Spirit : ‘స్పిరిట్’ షూటింగ్ మరింత ఆలస్యం… ప్రాజెక్ట్ ఇన్ని నెలలు లేట్ అవ్వడానికి ప్రభాసే కారణమా ?

Spirit : బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) లైనప్ లో భారీ బడ్జెట్ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్న ఈ హీరో వీలైనంత త్వరగా తన కొత్త ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ఈగరుగా వెయిట్ చేస్తున్నా మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘స్పిరిట్’ (Spirit) షూటింగ్ ప్రభాస్ కారణంగా మరింత ఆలస్యం కాబోతోంది అనేది లేటెస్ట్ గా అందుతున్న బ్యాడ్ న్యూస్.


ప్రభాస్ పై ఉన్న మెయిన్ కంప్లైంట్

ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమాతో పాటు హను రాఘవపూడి ‘ఫౌజీ’ (Fauji), సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ (Spirit), నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 Ad) సీక్వెల్ సినిమాలను చేయాల్సి ఉంది. కానీ ప్రభాస్ వల్ల కొత్త సినిమాలన్నీ ఆలస్యమవుతున్నాయని అంటున్నారు. ఆయన మధ్య మధ్యలో షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకోవడమే ఇలా ఆలస్యానికి మెయిన్ రీజన్ అనే కంప్లైంట్ వినిపిస్తోంది. ఆయనలా బ్రేక్ తీసుకోవడం వల్ల ముందుగా షెడ్యూల్ చేసిన షూటింగ్ లపై ఎఫెక్ట్ పడుతుందట. నిజానికి ప్రభాస్ కి తరచుగా బ్రేక్ కోసం యూరప్ కి వెళ్లడం అలవాటు అన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఆయన అలా విదేశాలకు వెళ్లారంటే రెండు మూడు వారాలు అక్కడే గడుపుతారు. దీనివల్ల అలాంటి టైంలో ప్లాన్ చేసిన షెడ్యూల్స్ పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుంది.  అయితే ఆయన బిగ్గెస్ట్ ప్లాన్ ఇండియా స్టార్ కావడంతో దర్శక నిర్మాతలు సైతం ప్రభాస్ పై ఒత్తిడి తీసుకురావట్లేదని ఇన్సైడ్ వర్గాల సమాచారం. అయితే ప్రభాస్ ఒక్కసారి కమిట్ అయ్యారంటే రెండు మూడు షెడ్యూల్స్ ను ఎలాంటి బ్రేక్ లేకుండా కంప్లీట్ చేస్తారు. అందుకే దర్శకు నిర్మాతలు ప్రభాస్ కోసం సైలెంట్ గా ఎదురు చూస్తున్నట్టు టాక్ నడుస్తోంది.


ప్రభాస్ కోసం ఎదురు చూపులు…

మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేయడానికి మేకర్స్ ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరిలో ‘ది రాజా సాబ్భ’ షూటింగ్ కోసం ఆయన డేట్స్ కేటాయించారు. కానీ గత ఏడాదే స్టార్ట్ కావాల్సిన ‘స్పిరిట్’ షూటింగ్ మాత్రం మరింత ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్ళబోతోంది.

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రూపొందనున్న మూవీ స్పిరిట్. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా, ప్రభాస్ రాక కోసం సందీప్ రెడ్డి వంగా మరికొన్ని నెలలు ఆగక తప్పదు అన్నది ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న లేటెస్ట్ సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ రామోజీ ఫిలిం సిటీ లో ‘ఫౌజీ’ షూటింగ్లో బిజీగా ఉన్నారు.  ఇప్పటికే పూర్తి కావాల్సిన ‘ఫౌజీ’ రెండు షెడ్యూల్స్ పోస్ట్ పోన్ అయ్యాయని, వాటిని పూర్తి చేయడానికి మరింత టైమ్ పడుతుందని తెలుస్తోంది. దీనివల్ల ‘స్పిరిట్’ షూటింగ్ మరో మూడు నెలలపాటు లేనట్టే. ఆ తర్వాత 2025 ద్వితీయార్థంలో ప్రభాస్ ‘కల్కి’ సీక్వెల్  షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×