Therachaapa Teaser: ఈ మధ్య కాలంలో మత్స్యకారుల జీవితాల ఆధారంగా వస్తున్న సినిమాలు ఎక్కువయ్యాయి. మొన్న ఈ మధ్య నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమాల్లో మత్స్యకారుల కష్టాల గురించి కళ్లకు కట్టినట్లు చూపించారు.. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే తరహాలో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ మూవీనే ‘తెరచాప ‘.. టైటిల్ కు తగ్గట్లేదు స్టోరీ ఉంటుందని టీజర్ ని చూస్తే అర్థమవుతుంది. సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ టీజర్ ని రిలీజ్ చేశారు. మత్స్యకారుల కష్టాల గురించి, వాళ్లకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం గురించి ఈ టీజర్ లో చూపించారు. ప్రస్తుతం ఆ టీజర్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
టీజర్ లాంచ్..
తెరచాప టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు.. హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్లో హీరో కార్తీక్ రత్నం, హరికథ దర్శకుడు మ్యాగీ చేతుల మీదగా ఈ చిత్ర టీజర్ లాంచ్ చేయడం జరిగింది.. అనంతరం మీడియాతో మాట్లాడారు.. మ్యాగీ మాట్లాడుతూ.. ఈ సినిమా టీం గురించి నాకు పెద్దగా తెలీదు, కానీ వీళ్ళు పెట్టిన ఎఫోర్ట్స్ నేను టీజర్ లో చూశాను. సినిమాలో మంచి కంటెంట్ ఉంది. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉందని అన్నారు. అలాగే డైరెక్టర్, నిర్మాత ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. టీజర్ లోని సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని సినిమాని తప్పకుండా అందరూ చూస్తారు అని ఆకాంక్షిస్తున్నారు..
Also Read:ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. వాటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..
తెరచాప టీజర్ హైలెట్స్ విషయానికొస్తే..
నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, స్రీలు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తెరచాప.. అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మాతగా వ్యవహరించగా, జోయల్ జార్జ్ రచనా దర్శకత్వం వహిస్తున్నారు.. రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, రాఖి, నాగ మహేష్, ఫిష్ వెంకట్, అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు, రాజేష్ భూపతి తదితరులు ఈ మూవీలో పలు పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
తాజాగా టీజర్ ని చేత యూనిట్ రిలీజ్ చేసింది.. ఆ టీజర్ లో వెయ్యి గడపలు.. ప్రతీకార అహం.. మంటల్లో కాలిపోతున్న జీవితాలు అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలైన టీజర్ లో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తమ బ్రతుకుతెరువు కోసం కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మత్స్యకారులు చేసే పోరాటం గురించి ఈ సినిమాలో చూపిస్తున్నారు.
టీజర్ ని చూస్తుంటే తమ హక్కుల కోసం పోరాడటం కోసం వాళ్ళు ఎంతవరకైనా వెళ్లేలా ఉన్నారని, ఎంతోమంది ప్రాణాలను కూడా కోల్పోయారని తెలుస్తుంది. ఆ వీడియో మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ ని చూస్తుంటే మరో తండేల్ అవుతుందని అర్థమవుతుంది. మొత్తానికి టీజర్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది. సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..