BigTV English

Himanshi narwal: ఆమెపై ట్రోలింగ్.. వాళ్లు మనుషులేనా..?

Himanshi narwal: ఆమెపై ట్రోలింగ్.. వాళ్లు మనుషులేనా..?

పహల్గాం అటాక్ లో చనిపోయిన నేవీ లెఫ్ట్ నెంట్ అధికారి వినయ్ నర్వాల్ భార్య హిమాన్షిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఈ దాడుల తర్వాత ముస్లింలను, కాశ్మీరీలను టార్గెట్ చేయొద్దని ఆమె ప్రకటించడమే దీనికి కారణం. అలా ప్రకటించినందుకు ఆమెపై ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ విషయంలో ఆమెకు ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, అధికారులు అండగా నిలిచారు. ఈ ట్రోలింగ్ మంచిది కాదంటున్నారు.


అసలేం జరిగింది..?
పహల్గాం అటాక్ లో ఉగ్రవాదులు జరిపిన దారుణ మారణకాండలో వినయ్ నర్వాల్ మృతి చెందారు. భార్య హిమాన్షి పక్కన ఉండగానే వినయ్ ని కాల్చి చంపారు దుండగులు. వినయ్, హిమాన్షి కొత్త జంట. హనీమూన్ కోసం వారు కాశ్మీర్ వచ్చారు. వాస్తవానికి వారు యూరప్ వెళ్లాల్సి ఉండగా, వీసా సమస్యతో కాశ్మీర్ కు హనీమూన్ కోసం వచ్చారు. చివరకు విధి వారి జంటను విడదీసింది. కళ్లముందే భర్త చనిపోవడంతో హిమాన్షి షాక్ కి గురైంది. భర్త అంత్యక్రియల రోజు కూడా ఆమెను చూసినవారంతా కంటతడిపెట్టారు. అయితే ఆమె ఇచ్చిన ఒక స్టేట్ మెంట్ ఆసక్తికరంగా మారింది. పహల్గాం దాడి తర్వాత ఏ ఒక్క వర్గాన్ని కూడా ప్రత్యేకంగా టార్గెట్ చేయడం సరికాదని హిమాన్షి అన్నది. అదే సమయంలో కాశ్మీరీలను కూడా టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయొద్దని ఆమె నెటిజన్లని కోరింది. ఆమె మంచితనాన్ని కొందరు ప్రశంసించగా, ఎక్కువమంది ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

హిమాన్షి పాకిస్తాన్ కి మద్దతుగా మాట్లాడినట్టుగా చిత్రీకరించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో రాక్షసానందం పొందారు. ఆమెను బాధితురాలిగా కాకుండా నిందితురాలిగా చూడటం మొదలు పెట్టారు. ఈ ట్రోలింగ్ మరీ శృతి మించడంతో ఆమెకు మద్దతిస్తున్నవారు కూడా సోషల్ మీడియాలో తమ కామెంట్లు పెట్టారు. హిమాన్షి తప్పు ఏముందని ప్రశ్నించారు. భర్తను పోగొట్టుకున్న ఆమెపై సింపతీ చూపించాల్సింది పోయి, ఇలా టార్గెట్ చేయడం సరికాదన్నారు. కేంద్రం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, ఆమెకు మద్దతుగా నిలవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.


ఇక మహిళా కమిషన్ కూడా హిమాన్షికి మద్దతుగా నిలిచింది. హిమాన్షిపై సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిగత దాడి సరైంది కాదని మహిళా కమిషన్ ఆక్షేపించింది. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌ ను మతం పేరు అడిగి మరీ ప్రాణాలు తీశారని, ఉగ్రఘటనపై దేశం మొత్తం ఆగ్రహంగా ఉందని మహిళా కమిషన్ తెలిపింది. హిమాన్షి నర్వాల్ వ్యక్తంచేసిన అభిప్రాయంపై సోషల్ మీడియాలో వస్తోన్న విమర్శలు ఆమోదయోగ్యం కాదని చెప్పింది. ఆమెపై జరుగుతున్న ట్రోలింగ్ ని ఖండిస్తున్నట్టు స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో బహిరంగ వ్యాఖ్యలు చేసేటప్పుడు ఎవరైనా మర్యాదగా, రాజ్యాంగ సరిహద్దులకు లోబడి వ్యవహరించాలని హెచ్చరించింది. దేశంలోని ప్రతి మహిళ గౌరవాన్ని కాపాడే దిశగా మహిలా కమిషన్ చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉందని తెలిపింది. తమకు నచ్చినట్టుగా మాట్లాడకపోతే బాధితుల్ని కూడా నిందితులుగా మార్చేస్తోంది సోషల్ మీడియా. ఇలాంటి దారుణాలకు ఇకనైనా అడ్డుకట్ట పడాలి. దుర్ఘటన జరిగినప్పుడు వీలైతే బాధితుల పక్షం వహించాలి, లేదా సైలెంట్ గా ఉండాలి. కానీ బాధితురాలిని కూడా టార్గెట్ చేయడం సరికాదంటున్నారు కొందరు నెటిజన్లు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×