BigTV English

Elon Musk Ukraine: నేను ఒక్క బటన్ నొక్కితే ఉక్రెయిన్ సైన్యం ఫినిష్.. జెలెన్‌స్కీని బెదిరించిన మస్క్‌

Elon Musk Ukraine: నేను ఒక్క బటన్ నొక్కితే ఉక్రెయిన్ సైన్యం ఫినిష్.. జెలెన్‌స్కీని బెదిరించిన మస్క్‌

Elon Musk Starlink Ukraine| రష్యాతో యుద్ధం శాశ్వతంగా కొనసాగేలా చేస్తున్నారని ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మండిపడ్డాడు. ఈ సందర్భంగా తమ ‘స్టార్ లింక్’ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తే, యుద్ధక్షేత్రంలో ఉక్రెయిన్ సైన్యాలు కుప్పకూలుతాయని హెచ్చరించారు. యుద్ధం విషయంలో పుతిన్ను పక్కన పెట్టి, కేవలం ఉక్రెయిన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారనే ట్వీట్పై మస్క్ స్పందించారు.


‘‘ఉక్రెయిన్ విషయంలో ముఖాముఖికి రావాలంటూ గతంలో పుతిన్కు సవాలు విసిరాను. మరోవైపు, ఉక్రెయిన్ సైన్యానికి మా స్టార్లింక్ వ్యవస్థ వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఒకవేళ ఈ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తే, రణరంగంలో ఉక్రెయిన్ సైన్యాలు కుప్పకూలుతాయి. ఏదేమైనా ఉక్రెయిన్కు ఓటమి అనివార్యం. అయినప్పటికీ.. ఏళ్ల తరబడి సాగుతున్న ఊచకోత విసుగు పుట్టిస్తోంది. ప్రాక్టికల్‌గా ఆలోచించేవారు, పరిస్థితిని అర్థం చేసుకునేవారు ఎవరైనా ముందు యుద్ధాన్ని ఆపాలని కోరుకుంటారు’’ అని మస్క్ పేర్కొన్నారు.

Also Read: డ్రగ్స్‌ను మించిన దందా.. కోడి గుడ్డు స్మగ్లింగ్!


మరోవైపు.. వైట్ హౌస్ సమీపంలో భారీ ఉక్రెయిన్ జెండా ఆవిష్కరణకు నిధులు ఎవరు కేటాయించారు? అంటూ ట్విట్టర్ – ‘ఎక్స్‌’ వేదికగా ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ఎలాన్ మస్క్‌ సమాధానమిచ్చారు. ‘‘ఉక్రెయిన్‌‌లోని టాప్ 10 సంపన్నులపై.. మరీ ముఖ్యంగా మొనాకోలో విలువైన ఆస్తులు, విలాసవంతమైన భవనాలు కలిగి ఉన్న వారిపై కఠిన ఆంక్షలు విధించాలి. తద్వారా ఇటువంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుంది’’ అని తెలిపారు. ఇదిలా ఉండగా, రష్యా దాడుల్లో ఉక్రెయిన్ కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో ప్రస్తుతం స్టార్లింక్ సేవలందిస్తోంది. సైన్యానికి ఇది ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోంది.

నాటో, ఐరాస నుంచి అమెరికా నిష్క్రమించాలి: ఎలాన్ మస్క్

అమెరికా డోజె సారథి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) నాటో (నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌-NATO) కూటమిలో అమెరికా భాగస్వామ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నాటో కూటమి నుంచి నిష్క్రమించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సీనియర్ సలహాదారు మైక్ లీ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్కు మస్క్ మద్దతు పలికారు. అమెరికా (USA) వెంటనే ఐక్యరాజ్య సమితి, నాటో కూటమి నుంచి నిష్ర్కమించాలని కోరారు. యురోప్ దేశాల రక్షణ కోసం అమెరికా డబ్బులు చెల్లించడం ఏమాత్రం సమంజసమైన విషయం కాదని పేర్కొన్నారు.

ఇప్పటికే నాటో భవిష్యత్తుపై ఆ దేశాల్లో సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో మస్క్ వ్యాఖ్యలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గతంలో నాటో దేశాల్లో నిధుల కేటాయింపుపై ట్రంప్ మాట్లాడుతూ, కూటమిలో నిర్ణయించిన విధంగా అన్ని దేశాలు రక్షణ వ్యవస్థ బలోపేతానికి తమ జీడిపీ నుంచి తగిన మొత్తంలో నిధులు కేటాయించాలన్నారు. నాటోలోని ఇతర దేశాలు తమ వంతు నిధులను కేటాయించకపోతే తమ రక్షణ దళాలను వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు.

కాగా, రక్షణ వ్యయాన్ని భారీగా పెంచే ఉద్దేశంతో ఈయూ దేశాలు గత వారం బ్రస్సెల్స్లో అత్యవసర శిఖరాగ్ర సమావేశం నిర్వహించాయి. తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకునేందుకు 800 బిలియన్ యూరోల (841 బిలియన్ డాలర్ల)తో ప్రణాళిక ప్రతిపాదించాయి. రక్షణ కోసం సభ్య దేశాలకు 162.5 బిలియన్ డాలర్ల రుణాలను అందించే యూరోపియన్ కమిషన్ ప్రతిపాదనపై చర్చించాయి. తాజాగా ఉక్రెయిన్ పట్ల అమెరికా తీరు యురోప్ దేశాల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. అసలు యూఎస్ వ్యూహం ఏమిటో ఇప్పటికీ స్పష్టంగా తెలియట్లేదని ఈయూ రక్షణ కమిషనర్ ఆండ్రియస్ కుబిలియస్ అన్నారు.

Related News

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Breaking News: కుప్పకూలిన మరో విమానం.. బూడిదైన శవాలు

Indian Army: అమెరికా చెప్పేదొకటి, చేసేదొకటి.. ట్రంప్ తీరుని ఎండగట్టిన ఇండియన్ ఆర్మీ

Trump on India: రష్యా నుంచి ఇండియా ఆయిల్ తీసుకుంటే.. ట్రంప్‌కు ఎందుకు మంట? కారణాలు ఇవే

Yemen: యెమెన్ తీరంలో పడవ బోల్తా 68 మంది జల సమాధి, 74 మంది గల్లంతు

Russia Earthquake: మళ్లీ భారీ భూకంపం.. బద్దలైన భారీ అగ్నిపర్వతం.. 6000 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన..?

Big Stories

×