HHVM: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చివరిగా తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) తో కలిసి బ్రో (BRO) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఇందులో ఆయన గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చినా.. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత రాజకీయాలపై పూర్తిగా ఫోకస్ పెట్టిన ఈయన.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. ఇకపోతే ఒకవైపు డీసీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరొకవైపు తన చేతిలో ఉన్న మూడు చిత్రాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగానే తాజాగా ప్రముఖ డైరెక్టర్ జ్యోతి కృష్ణ (Jyoti Krishna) దర్శకత్వంలో హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా చేస్తున్నారు. జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా టికెట్ ధరలు పెంచడానికి నిర్మాత ఏ.ఎం.రత్నం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Ravanth reddy) ని కలవనున్నట్లు సమాచారం. ఇక తెలంగాణ సంగతి ఓకే మరి ఆంధ్రప్రదేశ్ సంగతేంటి అని నెటిజెన్స్ కామెంట్లు చేస్తూ ఉండగా.. ఇప్పుడు తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న కఠిన నిర్ణయమే.. ఇప్పుడు ఆయన సినిమాపై దెబ్బ పడేలా ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
టికెట్ ధరల పెంపుకు ఏ ఎమ్ రత్నం ప్రయత్నం..
అసలు విషయంలోకి వెళ్తే.. సింగిల్ థియేటర్లు నష్టాల్లో ఉన్నాయని, ప్రేక్షకులు థియేటర్ కి రాకపోవడం వల్ల పూర్తిస్థాయిలో నష్టం వాటిల్లుతోందని , అద్దె కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడిందని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిక్యూటర్లు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జూన్ 1 నుండి సినిమా థియేటర్లను బంద్ చేయాలి అని కూడా పిలుపునిచ్చారు. కానీ నిర్మాతలు రంగంలోకి దిగి ఫిలిం ఛాంబర్ లో సమస్యకు పరిష్కారం చూపలేదు కానీ కొద్ది రోజులు సమస్యకి పరిష్కారం వాయిదా వేశారు. అయితే ఇండస్ట్రీలో ఇంత జరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు కలవలేదు అని, ఆయన సలహా ఎందుకు తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇకపై ఏ సమస్య వచ్చినా, ఆఖరికి టికెట్ రేటు పెంచడానికి అయినా నేరుగా సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఏపీ ముఖ్యమంత్రిని కలవకూడదని, ఫిలిం ఛాంబర్ ను సంప్రదించి, అక్కడి నుంచి ముఖ్యమంత్రికి దరఖాస్తు చేసుకోవాలని కామెంట్లు చేశారు.
డిప్యూటీ సీఎం అయిన దిగరావాల్సిందే..
అందులో భాగంగానే ఇప్పుడు తన సినిమా హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న విడుదల కాబోతోంది. అటు విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాను నిర్మిస్తున్న ఏఎం రత్నం సినిమా టికెట్ ధరలు పెంచాలని నిర్ణయించుకున్నారు. ఇక ఆయన కూడా ఫిలిం ఛాంబర్ ను సంప్రదించి, అక్కడ ఫిలిం ఛాంబర్ నుంచి సీఎంకు దరఖాస్తు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ టికెట్టు రేట్ల తిప్పలు కారణంగా ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అయినప్పటికీ తన సినిమా కోసం ఈయన కూడా ఈయన పెట్టిన నిర్ణయానికి కట్టుబడి ఫిలిం ఛాంబర్ ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇకపోతే ఈ విషయం తెలిసి నెటిజన్స్ డిప్యూటీ సీఎం అయినా దిగిరావాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Gaddar Awards : టాలీవుడ్‌కు అవార్డుల పంట… 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలు ఇవే..!