BigTV English

Bhimaa: గోపీచంద్ ‘భీమా’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంత రాబట్టిందంటే

Bhimaa: గోపీచంద్ ‘భీమా’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంత రాబట్టిందంటే

Bhimaa movie collections


Bhimaa movie collections(Tollywood news in telugu): టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్‌కి హిట్ పడి చాలా కాలమే అయింది. ఇందులో భాగంగా హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. అయినా ఇప్పటివరకు ఎలాంటి హిట్టును అందుకోలేకపోయాడు. అయితే ఈ సారి ఎలా అయినా హిట్టు కొట్టాలని మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ నేపథ్యంలో కన్నడ డైరెక్టర్ ఏ హర్ష దర్శకత్వంలో ‘భీమా’ అనే కొత్త సినిమాను చేశాడు. ఇందులో గోపీచంద్‌కు జోడీగా కావ్యా థాపర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించారు. ఇక పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌తో భారీ అంచనాలు అదుకున్న ఈ మూవీ మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


పురాణాల్లోని పరశురాముడి కథ ఆధారంగా తెరకెక్కిన పోలీస్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లరే ఈ భీమా మూవీ. ఇందులో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే నుంచే మిక్స్ డ్ టాక్ అందుకుంది.

READ MORE:  ‘గామి’కి భారీ ఓపెనింగ్స్.. ఫస్ట్‌ డే ఎంత కలెక్ట్ చేసిందంటే..?

ఈ మూవీలో యాక్షన్ సీన్స్, గోపీచంద్ యాక్టింగ్ అద్భుతంగా ఉన్నా.. ఎందుకో మరి సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయినట్లు తెలుస్తోంది. అయితే విడుదలకు ముందుక మంచి హైప్ ఉండటంతో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఈ మూవీని గోపీచంద్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ స్క్రీన్స్‌లో వదిలారు.

నైజాం, ఆంధ్రాలో కలిపి మొత్తం 600 స్క్రీన్స్, రెస్టాఫ్​ ఇండియాలో 100 స్క్రీన్స్​, ఓవర్సీస్​లో 200 స్క్రీన్లు మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 900 స్క్రీన్స్‌​లో ఈ మూవీని రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత కలెక్షన్స్ కాకపోయినా.. పర్వాలేదనిపించే ఓపెనింగ్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.

యూఎస్​, ఇతర ఏరియాల్లో కలిపి భీమా మూవీ మొదటి రోజు రూ.1.25 కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం. అలాగే ఏపీ, తెలంగాణలో కలిపి మొత్తం రూ.1.30 కోట్ల వరకు వసూలు చేసిందని టాక్ నడుస్తోంది. ఇక మొత్తంగా అన్ని ఏరియాలు కలుపుకొని ఈ మూవీ ఫస్ట్ డే రూ.3 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిందని ట్రెడ్ వర్గాల సమాచారం.

READ MORE: ఓటీటీ కంటే ముందే టీవీలోకి ‘హనుమాన్’.. కన్ఫర్మ్ చేసిన ప్రశాంత్ వర్మ.. ఏ ఛానల్‌లో తెలుసా

ఇక లాంగ్ వీకెండ్ ఉండటం, ఎక్కువ స్క్రీన్‌లలో ఈ మూవీ రిలీజ్ అవటంతో భీమా మూవీకి కలెక్షన్స్ భారీగానే వచ్చే అవకాశం ఉన్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ మూవీ రూ.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగినట్లు తెలుస్తోంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×