BigTV English

Aksha Pardasany: ప్రేమ పెళ్లి చేసుకున్న రామ్ పోతినేని హీరోయిన్.. ఫొటోలు వైరల్

Aksha Pardasany: ప్రేమ పెళ్లి చేసుకున్న రామ్ పోతినేని హీరోయిన్.. ఫొటోలు వైరల్


Aksha Pardasany: సినీ ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రెటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటుంటారు. ఏదో ఒక సినిమా ద్వారా పరిచయంమై కొంత కాలం ప్రేమాయణం చేసి ఆ తర్వాత పెళ్లి వరకు వెళ్తుంటారు. అయితే పెళ్లి చేసుకుని ఎంతోమంది సెలబ్రెటీలు సంతోష జీవితాన్ని గడుపుతున్నారు.

ఇటీవలే ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమ వివాహం చేసుకుంది. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. అయితే ఇప్పుడు ఇదే బాటలోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది.


టాలీవుడ్‌లో పలు సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మరో హీరోయిన్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇండస్ట్రీలోనే సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని వివాహమాడింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ హీరోయిన్ అక్ష పార్దసాని తాజాగా ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాపర్ కౌశల్‌తో గత కొంతకాలంగా ప్రేమాయణం చేసింది. గతేడాది నిశ్చితార్థం జరగ్గా.. తాజాగా ఈ ప్రేమ జంట వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అక్ష తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక ఈ బ్యూటీ సినిమా కెరీర్ విషయానికొస్తే.. 2004లో ఈ ముద్దుగుమ్మ ‘ముసాఫర్’ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది. అలాగే 2007లో ‘గోల్’ అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘యువత’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అనంతరం రైడ్, అది నువ్వే, కందిరీగ, శత్రువు, రయ్ రయ్, బెంగాల్ టైగర్, డిక్టేటర్, మెంటల్ పోలీస్ వంటి మరికొన్ని చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు తగ్గిపోవటంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంది.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×