Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు. క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందింది. ఈ మూవీలో చారిత్రక యోధుడిగా మునుపెన్నడూ చూడని పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా, బాబీ డియోల్, అనుపమ్ కేర్,సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. మొదటి భాగం పార్ట్ వన్, స్ప్రెడ్ వర్సెస్ స్పిరిట్ అనే క్యాప్షన్ తో జూన్ 12న రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ను షురూ చేయనుంది చిత్ర యూనిట్. తాజాగా మూవీ ట్రైలర్ అనౌన్స్మెంట్ పై సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..
ఇంటర్నేషనల్ స్క్రీన్ పై వీరముల్లు ట్రైలర్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత వస్తున్న మూవీ కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా నిమిషాల లో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రానికి సంబంధించి ఈ నెల 21న చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రెస్ మీట్ లో మూవీ ట్రైలర్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను దుబాయిలో ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా పై విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ టైలర్ తో ప్రమోషన్స్ ను భారీగా ప్లాన్ చేయనున్నారు చిత్ర యూనిట్. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇక మూవీ ట్రైలర్ ను దుబాయ్ లాంటి అంతర్జాతీయ వేదికపై విడుదల చేయటం తో మూవీ కి మరింత హైప్ రానుంది. గతంలో బాహుబలి, కే జి ఎఫ్, లాంటి చిత్రాల ఈవెంట్స్ దుబాయిలో నిర్వహించి, సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు అదే కోవలో హరిహర వీరమల్లు ట్రైలర్ ను రిలీజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నారు అభిమానులు.
ప్రమోషన్స్ అంటే ఇలా ఉండాలి..
ఇక ఈ మూవీ కథ 17వ దశాబ్దంలో, మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో రూపొందించారు. పవన్ కళ్యాణ్ ధైర్యవంతమైన యోధుడిగా వీరమల్లుగా నటిస్తున్నారు. ఆయన మొగల్ సైనిక జనరల్ నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రంలో, మొగల్ చక్రవర్తి ఔరంగజేబుగా, బాబి డియోల్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి మరో ఆకర్షణ ఎం ఎం కీరవాణి సంగీతం అందించడం. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై, ఏ దయాకర్ రావు, ఎం ఎం రత్నం నిర్మిస్తున్నారు. ఎప్పటినుంచో అభిమానులు ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం జూన్ 12న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. ఇప్పుడు ట్రైలర్ ను దుబాయిలో లాంచ్ చేసే ఆలోచనలో మూవీ టీం ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయి. ఏది ఏమైనా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడానికి సిద్ధమవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Ajith Kumar: అజిత్ 64 మూవీ అప్డేట్స్.. షూటింగ్ అప్పుడే స్టార్ట్..!