Groom Dies During Wedding| జననం, మృత్యువు మనిషి చేతిలో ఉండవు. ఇది ఎవరూ కాదనలేని నిజం. ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక యువకుడు సంతోషంగా పెళ్లి చేసుకుంటున్న సమయంలో అతడ శ్వాస ఆగిపోయింది. పెళ్లి పీటలపై ఉన్న పెళ్లికూతురు, వరుడి తల్లిదండ్రులు, మిత్రులు, బంధువులంతా చూస్తుండగానే అతను కుప్పకూలిపోయాడు. వెంటనే వరుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు అతను చనిపోయాడని ధృవీకరించారు. దీంతో సంతోషంగా పెళ్లి వేడుకల్లో ఉన్న వారంతా ఆ విషాదం గురించి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ప్రవీన్ అనే 25 ఏళ్ల యువకుడు కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట్ జిల్లా కుంహార హల్లి గ్రామానికి చెందిన వాడు. కొన్ని రోజలు క్రితమే అతనికి పూజ అనే యువతితో పెళ్లి నిశ్చయమైంది. ప్రవీన్ ఒక ప్రముఖ సైక్లిస్ట్. బాగల్ కోట్ సైక్లింగ్ అసోసియేషన్ కు సెక్రటరీగా కూడా ఉన్నాడు. అంటే అతను ఆరోగ్యవంతుడే. ఈ క్రమంలో ప్రవీన్, పూజల పెళ్లి శనివారం మే 17, 2025న బాగల్ కోట్ జిల్లా జాంఖండీ పట్టణంలో జరిగింది. స్థానికంగా ఉన్న నందికేశ్వర్ కల్యాణ మంటపంలో ముహూర్తానికి పెళ్లికొడుకు ప్రవీన్, వధువు పూజకు తాళి కూడా కట్టేశాడు.
పెళ్లిలో వచ్చిన అతని స్నేహితులు, బంధువులంతా సంతోషంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే కాపేపు తరువాత ప్రవీన్ రిసెప్షన్ కోసం వేదికపైకి ఎక్కాల్సి ఉంది. అప్పుడే అతను తనకు అలసటగా ఉందని స్నేహితులతో చెప్పాడు. కానీ ఎవరూ అతడి మాటలను సీరియస్ గా తీసుకోలేదు. దీంతో ప్రవీన్ స్టేజి ఎక్కడానికి వెళుతుండగా.. ఒక్కసారిగా అతనికి ఛాతీ భాగంలో నొప్పి కలిగింది. ముఖమంతా చెమటలతో ప్రవేన్ తన ఛాతీ భాగాన్ని పట్టుకొని అక్కడే కిందపడిపోయాడు. ఇది చూసి అతని తల్లిదండ్రులు, స్నేహితులు వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ప్రవీన్ చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ప్రవీన్ గుండె పోటుతో మరణించాడని డాక్టర్లు అన్నారు. అయితే అతడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు.
ప్రవీన్ మరణంతో అతని తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. భారత దేశంలో గత కొంతకాలంగా యువకులు గుండెపోటుతో చనిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరి 2025లో కూడా ఒక 23 ఏళ్ల యువతి తన పెళ్లిలో సంగీత్ కార్యక్రమంలో డాన్స్ చేస్తూ ఒక్కసారిగా స్టేజీ పైనే కుప్పకూలిపోయింది. ఆ తరువాత ఆమె గుండె పోటుతో మరణించిందని తేలింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
Also Read: 48 ఏళ్ల క్రితం నాటి హత్య కేసు.. సిగరెట్ ప్యాకెట్ ఆధారంగా హంతకుడిని పట్టుకున్న పోలీసులు
డిసెంబర్ 2024లో కూడా ఒక 14 ఏళ్ల బాలుడు స్కూల్ లో పరుగుల పోటీలు నిర్వహించగా.. ఆ పోటీలకు ప్రాక్టీస్ చేస్తూ గుండె పోటుతో మరణించాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అలీగడ్ లోని ఒక స్కూల్ లో జరిగింది.
మధ్యప్రదేశో లోని సాగర్ నగరంలో కూడా జనవరిలో ఇలాంటి ఘటనే జరిగింది. పెళ్లికొడుకు హర్షిత్ చౌబే వధువు మెడలో వరమాల వేశాక.. ఛాతీలో నొప్పి అంటూ కుప్పకూలిపోయాడు. అయితే ఊపిరి తీసుకునేందకు ఇబ్బందిపడుతూ చివరకు మరుసటి రోజు ఉదయం కన్నూ మూశాడు.