Weather News: ఈసారి వాతావరణంలో వింత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడో రావాల్సిన నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే వచ్చాయి. ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రైతులు కూడా వ్యవసాయ పనుల్లో బిజీ అయిపోయారు. పలు జిల్లాల్లో పత్తిగింజలు కూడా పెడుతున్నారు. కొందరు నార్లు కూడా పోస్తున్నారు. మరి కొంత మంది రైతులు పొలాలను ఇప్పుడే చదును చేస్తున్నారు. పంటపొలాల్లో రైతు నేస్తాలు ఆరుద్ర పురుగులు దర్శనం ఇస్తున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాలో గత వారం రోజుల నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. సేమ్ టైం.. పగటి వేళ ఎండలు కూడా దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో అయితే ఉరుములు, మెరుపులో కూడిన వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో పిడుగులు బీభత్సం సృష్టించడంతో.. కొంతమంది చనిపోయారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు కీలక అప్డేట్ ఇచ్చారు. తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ALSO READ: Court Jobs: కోర్టులో 1620 ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా..? రేపే లాస్ట్ డేట్ మిత్రమా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలో 22 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఏపీలోని పలు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ పడుతాయని పేర్కొంది.
ALSO READ: Telangana Movement: తెలంగాణ ఉద్యమంలో రియల్ హీరోలు వీళ్లే..!
ఏపీలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కోన్నారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని చెబుతున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రాబోయే ఈ మూడు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు.