Tollywood Heroine:తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటీనటులు చిన్నచిన్న సినిమాల ద్వారానే ఎక్కువ ఫేమస్ అవుతూ ఉంటారు. అలా ఫేమస్ అయినా హీరోయిన్లలో నీతి టేలర్(Niti Taylor) కూడా ఒకరు. అయితే ఈ హీరోయిన్ పేరు చెబితే తెలియకపోవచ్చు. కానీ ఈమె నటించిన సినిమా పేరు, ఈమె మొహాన్ని చూస్తే అందరు ఇట్టే గుర్తు పడతారు. డైరెక్టర్ త్రినాధరావు నక్కిన (Trinath Rao Nakkina) దర్శకత్వంలో 2012లో వచ్చిన “మేం వయసుకు వచ్చాం”(Mem Vayasuku Vaccham)సినిమా అప్పట్లో లవర్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో తనీష్ (Tanish) హీరోగా, నీతి టేలర్ హీరోయిన్ గా సెకండ్ హీరోయిన్గా రీమాసేన్ (Reema Sen) కూడా నటించింది. అలా ఈ మూవీలో హీరోయిన్ గా చేసిన నీతి టేలర్, తనీష్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలోని “వెళ్లిపోకే వెళ్లిపోకే నన్నే ఒంటరి చేసి” అనే పాట అప్పటి లవ్ ఫెయిల్యూర్స్ ని కన్నీళ్లు పెట్టించింది. ఇక ఈ సినిమాలో ముస్లిం అమ్మాయిగా నీతి టేలర్ అద్భుతంగా నటించింది. ఈ సినిమా విడుదలై హిట్ అవ్వడంతో నీతి టేలర్ ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా కూడా పేరు సంపాదించింది.
పెళ్లయిన ఐదేళ్లకే విడాకుల బాట..
ఇక ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ తో నీతి టేలర్ వరుస సినిమాలు చేసినప్పటికీ అంతగా హిట్ కొట్టలేదు. దాంతో ఈ హీరోయిన్ ని అందరూ మర్చిపోయారు. అయితే అలాంటి నీతి టేలర్ తాజాగా భర్తతో విడాకుల గురించి వార్తల్లో నిలిచింది. ఇక విషయంలోకి వెళ్తే..2020 కరోనా సమయంలో చాలామంది నటీనటులు పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లి చేసుకున్న వారిలో నీతి టేలర్ కూడా ఒకరు. ఆర్మీ ఆఫీసర్ అయిన పరీక్షిత్ భవా (Parikshith Bhava) ని పెళ్లి చేసుకున్న నీతి టేలర్ మూడు సంవత్సరాలు ఆయనతో బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత వీరి బంధంలో బీటలు వారినట్టు తెలుస్తోంది.ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడాకులకు అప్లై చేసినట్టు సమాచారం.ఇక రీసెంట్ గానే నీతి టేలర్ కూడా తన ఇంస్టాగ్రామ్ లో తన పేరులో నీతి భవా అనే పేరుని తీసివేసి, మళ్లీ నీతి టేలర్ గా ఐడి మార్చడంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. అయితే చాలామంది సెలబ్రిటీలు విడిపోయే ముందు ఇలాగే చేస్తారు. కాబట్టి నీతి టేలర్ విషయంలో విడాకులు నిజమే అని అందరూ కన్ఫామ్ అయ్యారు.
Sushmita Sen: పెళ్లిపై ఊహించని కామెంట్.. అలాంటివాడే కావాలంటూ..!
స్పందించిన నీతి.. ఆగని రూమర్స్..
ఇక రీసెంట్ గా ఈ విడాకుల వార్తలపై స్పందించిన నీతి టేలర్ “ఏం జరగనప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు” అంటూ చాలా ఘాటుగా మాట్లాడింది.దీంతో గొడవలు ఉంటేనే ఇంత ఘాటుగా స్పందించిందని, లేకపోతే మా మధ్య అలాంటిదేమీ లేదు. మేము కలిసే ఉన్నాం అని కూల్ గా చెప్పేదని చాలామంది ఈమె మాటలు చూసి అర్థం చేసుకున్నారు.మరి ఈ హీరోయిన్ నిజంగానే విడాకులు తీసుకుందా? లేదా? అనేది తెలియాలంటే నీతి టేలర్ స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సిందే.