BigTV English

Hero varun tej Matka movie: కాకినాడలో మట్కా గ్యాంగ్ తో వరుణ్ కు ఏం పని?

Hero varun tej Matka movie: కాకినాడలో మట్కా గ్యాంగ్ తో వరుణ్ కు ఏం పని?

Tollywood mega hero varun tej acting upcoming movie Matka shooting at Kakinada: సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా నచ్చిన క్యారెక్టర్స్ తో మెప్పిస్తూ వస్తున్నాడు వరుణ్ తేజ్. మెగా ఫ్యామిలీనుంచి వచ్చినా తన లిమిట్స్ లో ఉంటాడు వరుణ్ తేజ్. వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా వరుణ్ తేజ్ హ్యాండ్సప్ అనే మూవీలో నటించాడు. పదేళ్ల వయసులో హ్యాండ్సప్ లో నటించిన వరుణ్ తేజ్ కు ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఎవరికీ తెలియదు అందులో నటించినట్లు. వరుణ్ తేజ్ కు ఇప్పటిదాకా ఫిదా, ఎఫ్ 2, తొలి ప్రేమ లాంటి సక్సెస్ చిత్రాలు తప్ప కెరీర్ లో పెద్దగా చెప్పుకోదగిన సినిమాలేమీ లేవు. అయితే వరుణ్ తేజ్ రాబోయే తన అప్ కమింగ్ మూవీ మట్కా పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు నిర్మాతలు.


వరుణ్ తేజ్ తో భారీ బడ్జెట్

ఇప్పటిదాకా వరుణ్ తేజ్ ఇంత భారీ బడ్జెట్ మూవీలో నటించలేదు. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోంది ఈ మూవీ. 1950-80 మధ్య జరిగిన రియల్ ఇన్సిడెంట్స్తో ఈ మూవీని రూపొందిస్తున్నారు ప్రొడ్యూసర్స్. పూర్తి స్థాయి మాస్ యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న మూవీ మట్కా. అప్పట్లో మట్కా గ్యాంగ్ అంటే ముంబాయిలో పెద్ద గ్యాంబ్లింగ్ బిజినెస్. ఈ కథాంశంతో రూపొందించిన ఈ మూవీపై కొన్ని ఆసక్తికరమైన గాసిప్స్ నడుస్తున్నాయి. ముంబాయి నేపథ్యంలో బెట్టింగ్ లు, దందాలు, మట్కా వ్యాపారాలు నిర్వహించిన రతన్ ఖత్రి జీవిత కథ ఆధారంగా ఈ మూవీ ఉండబోతోందని సమాచారం. వ్యక్తిగతంగా వస్త్ర వ్యాపారాలు నిర్వహించి లాభాలు గడించిన రతన్ ఖత్రి మట్కా పేరిట బెట్టింగ్ లు మొదలు పెట్టాడు. క్రమంగా భారతదేశం మొత్తం విస్తరించింది.


కాకినాడలో చిత్రీకరణ

ఇక నార్త్ బ్యాక్ డ్రాప్ లో ఈ మట్కా మూవీ రూపొందనుంది. అయితే ఇదే మూవీ కథాంశంతో ఓటీటీ లో ఓ వెబ్ సిరీస్ కూడా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్ కు మట్కా కింగ్ అనే టైటిల్ కూడా పెట్టారు మేకర్స్. వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా మూవీని నిర్మాతలు భారీ ఎత్తున నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఖర్చుకు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా రూపొందిస్తున్న ఈ మూవీకి హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి వచ్చిన అప్ డేట్స్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ కాకినాడలో చిత్రీకరణ జరుగుతోందని మేకర్స్ ఓ అప్ డేట్ ఇచ్చారు. మట్కా మూవీకి సంబంధించిన కీలక యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నట్లు మేకర్స్ చెప్పారు.

విభిన్న షేడ్స్ లో..

వరుణ్ తేజ్ పై ఫైటింగ్ సన్నివేశాలు అలాగే కొందరు ముఖ్య తారాగణంపై టాకీపార్ట్ కూడా అక్కడే పూర్తిచేస్తామని ప్రొడ్యూసర్స్ చెబుతన్నారు. నూతన దర్శకుడు కరుణ కుమార్ నేతృత్వంలో వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ పాన్ ఇండియా మూవీ రపొందనుంది. ఇటీవల రిలీజయన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ మూవీపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. వరుణ్ తేజ్ యువకుడిగా..నడివయసు వ్యక్తిగా కనిపించే పోస్టర్స్ లుక్ తో వరుణ్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. 1950, 82 మధ్య జరిగిన స్టోరీ కావడంతో స్టోరీ పరంగా అలా తన లుక్ లో రెండు షేడ్స్ ఉండేలా వరుణ్ తేజ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ కూడా దీనిని ఓ ఛాలెంజింగ్ గా తీసుకుని చేస్తున్నాడు. క్యారెక్టర్ లో విభిన్నమైన స్టయిల్స్ ఉండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రీ రిలీజ్ కూడా భారీగానే బిజినెస్ జరిగినట్లు ఇండస్ట్రీ టాక్.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×