BigTV English

Telegram CEO Arrest: టెలీగ్రామ్ యాప్ సిఈవో పావెల్ డురోవ్ అరెస్ట్.. ఏం చేశాడంటే..

Telegram CEO Arrest: టెలీగ్రామ్ యాప్ సిఈవో పావెల్ డురోవ్ అరెస్ట్.. ఏం చేశాడంటే..

Telegram CEO Arrest| ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ టెలీగ్రామ్ వ్యవస్థాపకుడు, సిఈవో పావెల్ డురోవ్ (Pavel Durov)ని శనివారం రాత్రి ఫ్రాన్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన అజర్ బైజాన్ దేశ రాజధాని బకు నుంచి విమానంలో బయలుదేరి ఫ్రాన్స్ లోని ‘లీ బార్గెట్’ ఎయిర్ పోర్టుకి చేరుకోగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


బిలియనీర్ బిజినెస్ మ్యాన్ అయిన 39 ఏళ్ల పావెల్ డురోవ్ కు ప్రాన్స్, రష్యా దేశాల పౌరసత్వం ఉంది. సోషల్ మెసేజింగ్ యాప్ టెలీగ్రామ్ పై చాలా ఈజీగా ఏ అడ్డూ లేకుండా చాలా స్కామ్స్, టెర్రరిస్ట్ కార్యకలాపాలు, తప్పుడు సమాచారం వ్యాప్తి జరుగుతుండగా.. వాటిని నియంత్రించడానికి టెలీగ్రామ్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని.. పైగా ఇలాంటి నేరాలను ప్రోత్సహిస్తోందనే ఆరోపణలున్నాయి.

టెలీగ్రామ్ చట్టపరంగా ఏ నిబంధనలను అమలు చేయకపోవడంతో ఆ యాప్ సిఈవో పావెల్ డురోవ్ పై అంతర్జాతీయంగా అరెస్ట్ వారంట్ జారీ అయింది. ఈ క్రమంలో పావెల్.. ఫ్రాన్స్ దేశానికి రాగానే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. పావెల్ అరెస్టు పై ఫ్రాన్స్ ప్రభుత్వం లేదా పోలీసులు అధికారికంగా స్పందించలేదు. అయితే ఫ్రాన్స్ స్థానిక మీడియా.. పావెల్ డురోవ్ ని ఆదివారం పోలీసులు కోర్టులో విచారణకు తీసుకెళ్తారని తెలిపింది.


టెలిగ్రామ్ కంపెనీ.. సోషల్ మీడియా మాడరేషన్ చట్టాలు ఉల్లంఘిస్తోందనే ఆరోపణలుండగా.. పావెల్ ను అరెస్టు చేశారు. వాట్సాప్, ఇన్స్‌టాగ్రామ్, టిక్ టాక్, వి చాట్ లాగా టెలీగ్రామ్ కూడా ఇన్స్‌టెంట్ మెసేజింగ్ యాప్. ఈ యాప్ లో ఒకే గ్రూపులో 2 లక్షల మంది దాకా చేరవచ్చు. ఇది చట్టవ్యతిరేకం. దీని వల్ల అతివేగంగా తప్పుడు సమాచారం వ్యాప్తి అయ్యే ప్రమాదముంది.

Also Read:  ‘నా ఇష్టం మీకేంటి?’.. 16 ఏళ్ల అబ్బాయిని డేట్ చేస్తున్న 21 ఏళ్ల భామ..

పావెల్ డురోవ్ కు 2021లో ఫ్రాన్స్ పౌరసత్వం లభించింది. అయితే ఆయన ప్రస్తుతం దుబాయ్ లో నివసిస్తున్నారు. చాలా దేశాల్లో ఆయనపై అరెస్టు వారెంట్ జారీ కాగా.. ఆయన 2017 నుంచి దుబాయ్ నుంచే టెలీగ్రామ్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయనకు రష్యా ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది.

రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో కీలకంగా మారిన టెలీగ్రామ్
రష్యా, యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో టెలీగ్రామ్ కీలకంగా మారింది. ఇటు యుక్రెయిన్ అధికారులు, అటు రష్యా అధికారులు తమ తమ గ్రూపులు ద్వారా సమాచారం చేరవేస్తున్నారని.. ఈ యాప్ ఒక విధంగా యుక్రెయిన్ యుద్ధంలో వర్చువల్ బ్యాటిల్ ఫీల్డ్ గా మారిందని టెక్ నిపుణలు చెబుతున్నారు.

Also Read: Man Marries sister: వధువు చేయి చూసి పెళ్లి ఆపేసిన వరుడి తల్లి.. ఏం జరిగిందంటే..

అంతర్జాతీయ పత్రిక ఫోర్బ్స్ ప్రకారం.. పావెల్ డురోవ్ నెట్ వర్త్ 15.5 బిలియన్ డాలర్లు. ఆయన 2014లో రష్యా దేశాన్ని వదిలి దుబాయ్ లో స్థిరపడ్డారు. రష్యా లో విపక్ష పార్టీలకు వ్యతిరేకంగా పనిచేయమని ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో పావెల్ ఆ దేశాన్ని వదిలివెళ్లిపోయారు.

Also Read: టన్నెల్ లో తిరుగుతున్న ఆత్మ.. కేవలం అలాంటి వారితో మాత్రమే మాట్లాడుతుంది

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×