BigTV English

Telugu Cinema : పర్సంటేజ్ పంచాయితీ… సిండికేట్స్‌గా విడిపోయిన టాలీవుడ్ నిర్మాతలు

Telugu Cinema : పర్సంటేజ్ పంచాయితీ… సిండికేట్స్‌గా విడిపోయిన టాలీవుడ్ నిర్మాతలు

Telugu Cinema : కరోనాకు ముందు కళకళలాడిన థియేటర్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఏవో ఒకటి రెండు పెద్ద సినిమాలకు తప్ప, మిగతా సినిమాల కోసం అసలు జనాలు థియేటర్ల వైపు చూడట్లేదు. ఈ నేపథ్యంలోనే థియేటర్లు మూతపడాల్సిన క్లిష్ట పరిస్థితి నెలకొంది. చాలా రోజుల నుంచి పలుచోట్ల థియేటర్లు మూతపడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ ఏడాది కూడా పరిస్థితి ఇదే మాదిరిగా ఉండడంతో మరోసారి టాలీవుడ్ లో ఆందోళన మొదలైంది. అయితే ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టడానికి పలువురు టాలీవుడ్ బడా నిర్మాతలు ఒక సిండికేట్ గా మారి, పర్సంటేజ్ పంచాయతీని తెరపైకి తీసుకొచ్చారు. మరి ఇంతకీ ఈ పర్సంటేజ్ సిస్టం వల్ల నష్టం ఎవరికి? లాభం ఎవరికి? అనే వివరాల్లోకి వెళితే…


లాభపడేది ఆ ముగ్గురే…  

రీసెంట్ గా రెంటల్స్ మీద థియేటర్లను నడపడం కష్టం. కాబట్టి పర్సంటేజ్ సిస్టంలో సినిమాలు ఆడిస్తామని ఈస్ట్, కృష్ణా ఎగ్జిబిటర్లు మాట్లాడుకున్నారు. ఇక ఇప్పుడు నైజాంలోనూ ఇదే పద్ధతి మొదలు పెడదామని నిర్ణయించుకున్నారు నిర్మాతలు శిరీష్, సునీల్ నారంగ్, సురేష్ బాబు. ఈనెల 18న ఇదే విషయమై నైజాం డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ కూడా జరగబోతోంది.


నిజానికి పర్సంటేజ్ సిస్టం వస్తే థియేటర్ల ఓనర్లు కాస్త కాసులను కళ్ళజూస్తారు. కానీ నిర్మాతలకు మాత్రం ఆ వచ్చే నాలుగు రాళ్లు కూడా తగ్గిపోతాయి. ఇప్పటికే థియేటర్ లో నుంచి వచ్చే రెవెన్యూ తక్కువ అని భావించే నిర్మాతలకు ఈ పర్సంటేజ్ సిస్టం అంటే నెత్తిమీద పిడుగు పడ్డట్టే. నిజానికి నైజాంలో థియేటర్లు చాలావరకు శిరీష్, సునీల్ నారంగ్, సురేష్ బాబు చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి అల్టిమేట్ గా ఈ పర్సంటేజ్ సిస్టం వల్ల లాభపడేది వీళ్ళు ముగ్గురే. కానీ మిగతా నిర్మాతలు మాత్రం భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఓటీటీల నుంచి రావాల్సిన ఆదాయం బాగా తగ్గింది. థియేటర్ల నుంచి చెప్పుకోదగ్గ విధంగా ఏమాత్రం లేదు. ఇక ఇప్పుడు పర్సంటేజ్ సిస్టం వల్ల పరిస్థితి ఇంకా దిగజారితే హీరోలకు ఇంతటి భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి సినిమాలు తీయడం అన్నది కష్టం.

60 థియేటర్లలోనే నష్టాలు 

నైజాంలో మొత్తం 640 కి పైగా థియేటర్లు ఉండగా, దాదాపు 240 థియేటర్లు ఈ ముగ్గురు నిర్మాతల చేతుల్లోనే ఉన్నాయి. ఇక మల్టీప్లెక్స్ లో ఇప్పటికే ఈ పర్సంటేజ్ సిస్టం సాగుతోంది. మిగిలిన మరో 200 సి క్లాస్. ఈ థియేటర్లలో సినిమాలు వేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఇక చివరగా మిగిలిన మరో 100 థియేటర్లలో 40 నుంచి 45 థియేటర్లు మైత్రి అండర్ లోనే ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే 60 నుంచి 65 థియేటర్లు మాత్రమే ఆ ముగ్గురు నిర్మాతలకు ఇబ్బంది. కాబట్టి పర్సంటే సిస్టం వల్ల ఈ ముగ్గురే లాభాలు చూస్తారు.

ఇక థియేటర్లు లేకపోవడం వల్ల ఇటీవల కాలంలో ఎక్కువగా సినిమాలు చేస్తున్న నిర్మాత నాగ వంశీ నష్టపోక తప్పదు. అలాగే ఇప్పుడు పర్సంటేజ్ సిస్టం తెరపైకి వస్తే థియేటర్లలో త్వరలోనే పెద్ద సినిమాల రిలీజ్ కు సిద్ధమవుతున్న మైత్రిది కూడా ఇదే పరిస్థితి.

Read Also : ఊరికి వింత శాపం… విరూపాక్ష లాంటి అదిరిపోయే గుజరాతీ హార్రర్ థ్రిల్లర్

నిజానికి కరోనా కంటే ముందే ఈ పని చేద్దాం అనుకున్నారు. కానీ అప్పట్లో వరుసగా దిల్ రాజు పెద్ద సినిమాల రిలీజ్ ఉండడంతో ఈ సిస్టంని పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు వీళ్ళ సినిమాలు లేకపోవడంతో మరోసారి పర్సంటేజ్ సిస్టం తెరపైకి రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ అనుకున్నట్టుగానే ఈ సిస్టం స్టార్ట్ అయితే థియేటర్ల కంటే థియేటర్స్ సిండికేట్లే బాగుపడతారు అన్నది వాస్తవం. ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించగలిగితే ఈ సిస్టంను ఎత్తేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఎనిమిది వారాల లోపు సినిమాలు ఓటీటీలకు ఇవ్వడం, హీరోలు రెమ్యూనరేషన్లు  తగ్గించుకోవడం, ఏడాదికి రెండు సినిమాలు చేయడం, డిజిటల్ కంపెనీలు క్యూబ్ చార్జెస్ తగ్గించుకోవడం వంటివి జరిగితేనే థియేటర్లు బాగుపడతాయి.

Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×