Lovers Viral Video: రాను రాను జనాలు కనీస విలువలను మర్చిపోయి.. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ట్రెండింగ్ అనే భావనలో పడి నాగరికతను మంగళం పాడేస్తున్నారు. చదువుకునే రోజుల్లో ప్రేమించడమే తప్పు.. అలాంటిది ఓ జంట నడి రోడ్డు మీద బైకుపై ప్రయాణిస్తూ.. చుట్టు ప్రక్కల మనుషులను కూడా పట్టించుకోకుండా.. బరితెగించి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు.
‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు.. నా యిచ్ఛయే గాక నాకేటి వెరపు’ అన్న కృష్ణశాస్త్రి మాటలు ఇప్పుడు అక్షరాల నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. బరితెగించిన ఓ ప్రేమ జంట బైక్‌పై వెళుతూ అసహ్యంగా ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నలుగురు చూస్తారనే ఆలోచన, భయం కూడా లేకుండా బైక్‌పై అసభ్యకర భంగిమలో కూర్చుని వెళ్లారు.
విజయవాడ NH5 రామలింగేశ్వర నగర్ ఫ్లై ఓవర్ వద్ద ప్రేమ జంట బైక్ మీద వెళ్తూ.. అసభ్యంగా ప్రవర్తించడం చూసి అటుగా వెళ్లే వాళ్లు అవాక్కయ్యారు. తప్ప తాగి బండి నడపడమే తప్పు అంటే.. ఏకంగా ప్రియుడు బైక్ నడుపుతుంటే ప్రియురాలు అతడి ముందు పెట్రోల్ ట్యాంక్‌పై ఎదురుగా కూర్చుంది. పక్కనే ద్విచక్ర వాహనాలపై ఎంతో మంది వెళ్తున్నా వీళ్లు రొమాన్స్‌కు మాత్రం బ్రేక్ ఇవ్వలేదు. చుట్టుపక్కలవాళ్లు తమనే గమనిస్తున్నారన్న ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించారు.
ఈ వీడియోలో బైక్ నడుపుతున్న వ్యక్తికి కానీ, అతని ముందు కూర్చున్న యువతికి కానీ హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. బుద్దిగా చదువుకోమని పేరెంట్స్ ఎంతో కష్టపడి కాలేజీలకు పంపిస్తే.. వారు నిర్వాకం ఇది. నిజంగా ఈ సంఘటన అమానుషమైనది. బరితెగించి రోడ్డుపైనన ఆ విధంగా ప్రవర్తిస్తే.. తల్లిదండ్రులు పరువు ఏమవుతుందో అని.. ఆలోచించకుండా ఉండే ఇలాంటి పిల్లలు ఆ కుటుంబానికే చేటు అనే చెప్పాలి.
ప్రస్తుత సమాజంలో చాలామంది పిల్లలకు చదువుకోవాలని ఉన్నప్పటికీ.. ఇంట్లో పరిస్థితులు వల్ల చదువు మధ్యలో ఆపేసిన అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. అయితే ఈ వీడియోలో కనిపించే అమ్మాయి మాత్రం చదువుకి చరమగీతం పాడి ప్రేమికునితో చక్కర్లు కొట్టేసింది. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే.. పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే..
నిజానికి ప్రేమ చాలా పవిత్రమైంది. మనం ఎన్నో పుస్తకాల్లో.. ఎందరో మహానుభావులు కూడా చెబుతూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ప్రేమికులు చేసే మితిమీరిన అల్లరి అసహ్యం పుట్టించేలా చేస్తున్నాయి. పట్టపగలు, రాత్రి అనే తేడా లేకుండా రొమాన్స్ చేస్తూ.. రోతపుట్టిస్తున్నారు. ప్రేమ పేరుతో నడిరోడ్డుపై హంగామా చేస్తూ.. అడ్డదిడ్డంగా నడుచుకుని చివరకు పోలీస్టేషన్‌కు చేరడం వింత గొలుపుతుంది. ప్రేమ అనే పేరుతో విచిత్రమైన పనులు చేస్తున్నారు. చివరకు ఏవో జరిగిపోతున్నాయి. ఇలాంటి సంఘటనల వల్ల లవ్ అంటేనే బూటకం అనిపిస్తోంది.
Also Read: శ్రీముఖి , ఆదిరెడ్డి గుట్టురట్టు చేసిన అన్వేష్.. ఖి’లేడీ’ అంటూ..!
అయితే ఇలాంటి సంఘటనలు జరగటం ఇదేం కొత్త కాదు.. విశాఖపట్నంలో కూడా ఓ జంట ఇలానే రోత పనులు చేస్తూ.. దొరికిపోయారు. 2021లో బీహార్ నుండి ఓ జంట ఇలానే రోడ్డుపై బైక్ మీద అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో తెగ వైరల్ అయింది. చుట్టుప్రక్కల మనుషులను పట్టించుకోకుండా.. ఏకంగా ప్రియుడు బైక్ నడుపుతుంటే ప్రియురాలు అతడి ముందు పెట్రోల్ ట్యాంక్‌పై ఎదురుగా కూర్చుంది. ఈ సంఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియోలో పోస్ట్ చేశారు.
લાજ-શરમ નેવે મૂકી! પ્રેમિકાને બાઈકની ટાંકી પર બેસાડીને યુવકે માણ્યો રોમાન્સનો આનંદ, વીડિયો વાયરલ
(સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો આંધ્રપ્રદેશના વિજયવાડા હાઇવે પરનો હોવાનું કહેવાઇ રહ્યું છે. જેમાં એક કપલ ચાલુ બાઇક પર જ બિભત્સ હરકત કરતા નજરે પડે છે.
રામલિંગેશ્વર નગર ફ્લાયઓવર પરનો… pic.twitter.com/gSPJVfKhkN— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 18, 2025