Allu Arjun Case : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కు తాజాగా నాంపల్లి కోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. రెగ్యులర్ బెయిల్ కి అప్లై చేసిన అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించగా, తాజాగా ఈ నిబంధనలను మినహాయించింది. అలాగే కోర్టులో అనుమతులు ఇచ్చినప్పటికీ, అల్లు అర్జున్ ఈ ఆదివారం మళ్లీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళక తప్పదు. ఎందుకంటే…
అల్లు అర్జున్ కు ఊరట
‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ ప్రీమియర్స్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక ఆమె కొడుకు శ్రీతేజ్ గాయాలతో అప్పటి నుంచి ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్ట్ ముందు హాజరు పరిచారు.
ఈ సెన్సేషనల్ ఘటన జరుగుతున్న తరుణంలోనే కోర్టు బన్నీ (Allu Arjun)కి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ ను పోలీసులు చంచల్ కూడా జైలుకు తరలించారు. ఒక రాత్రంతా జైల్లోనే గడిపిన అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేయడంతో నెక్స్ట్ డే ఉదయాన్నే బెయిల్ మీద బయటకు వచ్చాడు.
ఇక రీసెంట్ గా బెయిల్ గడువు ముగియడంతో రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన అప్లై చేసుకున్నారు. అయితే నాంపల్లి కోర్టు బన్నీకి పలు షరతులతో కూడిన బెయిల్ లో మంజూరు చేసింది. అందులో భాగంగా ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి సైన్ చేయాలని ఆదేశించింది. తాజాగా నాంపల్లి కోర్టు ఈ షరతును మినహాయించి బన్నీకి ఊరటనిచ్చింది. పైగా అల్లు అర్జున్ కు అన్ని అనుమతులు ఇచ్చేసింది. అందులో భాగంగా బన్నీ విదేశాలకు వెళ్లడానికి కూడా అనుమతినిచ్చింది.
రేపు పోలీస్ స్టేషన్ కు వెళ్ళాల్సిందే
భద్రతా కారణాలతో మినహాయింపు కోరిన అల్లు అర్జున్ (Allu Arjun)కు కోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో గుడ్ న్యూస్ అందింది. ఇక అలాగే ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్కు వెళ్లి సైన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది కోర్టు. అయినప్పటికీ అల్లు అర్జున్ రేపు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తీరాల్సిందే అని మళ్లీ ట్విస్ట్ ఇచ్చింది కోర్టు. అయితే రేపు ఒక్కరోజు మాత్రమే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్తే సరిపోతుంది. ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ తర్వాత మళ్లీ వెళ్లాల్సిన అవసరం లేకపోవచ్చు. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ ఎయిర్ పోర్ట్ లో కనిపించిన పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.