BigTV English

Pakistan Gold Indus River : జాక్‌పాట్ కొట్టిన పాకిస్తాన్.. సింధూ నది సమీపంలో భారీ బంగారు నిధి గుర్తింపు

Pakistan Gold Indus River : జాక్‌పాట్ కొట్టిన పాకిస్తాన్.. సింధూ నది సమీపంలో భారీ బంగారు నిధి గుర్తింపు

Pakistan Gold Indus River | ఆర్థికంగా కుంగిపోయి దివాళా తీసిన పాకిస్తాన్ కు అనూహ్యంగా అదృష్ట దేవత కరుణించింది. పాకిస్తాన్ భూభాగంలోని సింధూ నది సమీపంలో భారీ బంగారు నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ ప్రకటించింది. పంజాబ్ రాష్ట్రంలోని అట్టోక్ జిల్లా భూభాగంలోని సింధూ నదిలో 32.6 మెట్రిక్ టన్నుల బంగారం నిధి ఉందని.. ఆ నిధి విలువ సుమారు 600 బిలియన్ పాకిస్తానీ రూపాయలని పేర్కొంది. (భారత్ కరెన్సీలో రూ.18 వేల కోట్లకు పైనే)


కొన్ని నెలల క్రితమే చైనా భూభాగంలో కూడా రూ.7 లక్షల కోట్ల బంగారు నిల్వలు ఉన్నట్లు తెలిసింది. చైనా జాతీయ మీడియా ప్రకారం పింగ్ జియాంగ్ కౌంటీలో 1000 మెట్రిక్ టన్నుల హై క్వాలిటీ బంగారం ఉన్నట్లు గుర్తించారు. ఈ బంగారం విలువ సుమారు రూ.6,91,473 కోట్లు అని అంచనా. ప్రపంచలోనే ఇంత పెద్ద మొత్తంలో బంగారు నిల్వలు బయటపడడం ఇదే తొలిసారి.

దివాళా తీసిన పాకిస్తాన్ కు అదృష్టం
పాకిస్తాన్ దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైపోయింది. దేశ ఖజానాలో విదేశీ కరెన్సీ నిల్వలు ఆవిరైపోయాయి. యువతకు ఉద్యోగాలు లేక, ప్రజలు ఆహారం లభించక విలవిల్లాడుతన్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో అనుకోకుండా పాకిస్తాన్ జియోలాజికల్ సర్వే కంటికి భారీ బంగారు నిధి కనిపించింది. సిందూ నదిలో బయటపడిన బంగారు నిల్వలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పెట్టేందకు ఓ మార్గం లభించింది.


సింధూ నదిలో బంగారు నిల్వలు కనుగున్నట్ల ముందుగా పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్ర మైనింగ్ మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ ప్రకటించారు. జియోలాజికల్ సర్వేలో ఈ విషయం బయటపడిందన్నారు. ఈ ప్రకటనలో అక్కడ కొంతమంది అక్రమంగా తవ్వకాలు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అక్రమ తవ్వకాలను నిరోధించడానికి ప్రభుత్వం మైనింగ్ కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభించనుందని మీడియా తెలిపింది.

అట్టోక్ జిల్లాలో సింధూ నదిలో బయటపడిన ఈ బంగారు గని సుమారు 32 కిలోమీటర్ల పొడవు ఉంటుందని నిపుణలు చెబుతున్నారు. వీటికి తోడు పంజాబ్ లోని ఇతర ప్రాంతాలు, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా రాష్ట్రాల్లోని పెషావర్ , మర్దాన్ ప్రాంతాల్లో కూడా బంగారు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.

Also Read:  9 మంది బిచ్చగాళ్లు సహా 232 పాకిస్తానీలను డిపోర్ట్ చేసిన సౌదీ అరేబియా.. కరాచీలో అరెస్ట్

పాకిస్తాన్ భూభాగంలో ఖనిజ వనురుల కోసం వెతుకుతుండగా ఈ బంగారు గని ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం సింధూ నది ప్రాంతంలో 2022 నుంచి ప్రభుత్వం సెక్షన్ 144 విధించి అక్రమ తవ్వకాలు, మైనింగ్ చర్యలపై నిషేధం విధించింది.

సింధూ నదీ ప్రాంతంలో బయటపడిన బంగారు ఖనిజాల నిల్వలు హిమాలయ పర్వతాల కింద లక్షలాది సంవత్సరాల క్రితం జరిగిన టెక్‌టానిక్ చర్యల వల్ల ఏర్పడ్డాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నది పాకిస్తాన్ మీదుగా ప్రవహించడంతో హిమాలయాల నుంచి నదీ మార్గంలో బంగారు ఖనిఖ పదార్థాలు కూడా ఆ దిశగా ప్రవహించాయని చెబుతున్నారు. అయితే ఈ ఖనిజాలు బయటికి తీయడానికి చలికాలం అనువైన సమయమని.. చలికాలంలో నదీ జలాలు తక్కువ ఉండడమే దీనికి కారణమని గనుల తవ్వకాల నిపుణుల అభిప్రాయం.

అయితే ఈ ప్రాంతంలో గనుల తవ్వకాలపై పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పేచీ నడుస్తోంది. వాటాల గురించి చర్చల తరువాత గనులలో తవ్వకాలు ప్రారంభం కానున్నాయి. దీంతో బంగారు వెలికితీత పనుల్లో జాప్యం జరుగుతోంది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×