BigTV English

Priyadarshi : పాపం… ప్రియదర్శి సినిమాకు థియేటర్ లో నో ఛాన్స్… ఇక ఓటీటీనే బెటరా..?

Priyadarshi : పాపం… ప్రియదర్శి సినిమాకు థియేటర్ లో నో ఛాన్స్… ఇక ఓటీటీనే బెటరా..?

Priyadarshi : టాలీవుడ్ కమెడియన్స్ లో ఒకరైన ప్రియదర్శి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా సారంగపాణి జాతకం. కమెడియన్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి, ఇప్పుడు హీరోగా మన ముందుకు వచ్చాడు ప్రియదర్శి. తెలుగులో కామెడీ స్టార్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోగా ఎదిగిన వారు ఉన్నారు. వారిలో మనకి మొదటి గుర్తొచ్చే పేరు రాజేంద్రప్రసాద్, ఆలీ, సునీల్, సుధీర్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టు ఏ ఉంటుంది. ఆ లిస్టులో చేరిపోయారు ప్రియదర్శి. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలింగ కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శి కి జంటగా రూప కుడువాయుర్ నటిస్తున్నారు. జెంటిల్మెన్, సమ్మోహనం సినిమాల తరువాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ నుండి వస్తున్న సినిమా సారంగపాణి జాతకం. ఈ మూవీ కొన్ని నెలల క్రితమే రిలీజ్ అవ్వాల్సి ఉండగా, అనుకోని కారణాలతో రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ ఈ వేసవికి సినిమాను మీ ముందుకు తీసుకు వస్తాం అని ఏప్రిల్ 18 డేట్ ను ప్రకటించింది. ఇప్పుడు ఆ డేట్ కూడా వాయిదా పడేలా ఉంది ఆ వివరాలు చూద్దాం..


రిలీజ్ వాయిదా ..

ఇంద్రగంటి మోహన్ కృష్ణ, శివలింక కృష్ణ ప్రసాద్, కలయికలో వస్తున్న మూడో చిత్రం సారంగపాణి జాతకం. ఈ సినిమా 2024 డిసెంబర్ లోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది. నవంబర్ లోనే టీజర్ ను రిలీజ్ చేశారు. అనుకోని కారణాలతో రిలీజ్ ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఈ వేసవి కాలంలో సినిమా రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఏప్రిల్ 18 వ తారీకు సినిమా రిలీజ్ చేస్తామని నిర్మాత ప్రకటించారు. ఇప్పుడు ఈ డేట్ ని కూడా మారుస్తారని సమాచారం. థియేటర్స్ అయితే దొరికాయి కానీ, బయ్యర్స్ సినిమాని మేలో రిలీజ్ చేస్తే బాగుంటుందని.. ఏప్రిల్ 18న సినిమా వాయిదా వేసి మేలో రిలీజ్ చేయాలని బయ్యర్లు నిర్మాతని కోరినట్లు సమాచారం.


ఇలా ఐతే కష్టమే ..

ఏప్రిల్ నెలలో భారీ తెలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అందులో తమన్నా కీలక పాత్రలో నటించిన చిత్రం ఓదెల 2 ఏప్రిల్ 17వ తేదీన విడుదల కానుంది. కళ్యాణ్ రామ్, విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న అర్జున్ s/o వైజయంతి కూడా ఏప్రిల్ లోనే రిలీజ్ కానుంది. అందుకని సారంగపాణి ఆలస్యంగా విడుదల చేయనున్నారా, మరేదైనా కారణం ఉందా అని తెలియాల్సి ఉంది..సారంగపాణి జాతకం సినిమా మొత్తం జాతకం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది మన జీవితం మొత్తం మన చేతిలో రాసి ఉంటుంది అని చెబుతూ హీరో, పేపర్లో చూసినదంతా నిజం అవుతుందని, జాతకం లో ఉన్నది ఉన్నట్లు జరుగుతుందని జాతకాన్ని బాగా నమ్మే క్యారెక్టర్ లో ప్రియదర్శి నటించాడు. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ వేసవికి మన ముందుకు రానుంది.

 

Also read :Kalyan Ram: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జాతరే.. తమ్ముడు వస్తున్నాడు

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×