OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి అన్ని భాషలలో ఈ సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అందుకున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే మూవీలో నాలుగు స్టోరీలు ఉంటాయి. ప్రతి స్టోరీలో క్రైమ్ తో పిచ్చెక్కించే సన్నివేశాలు ఉంటాయి. చివరి వరకు ఉత్కంఠంగా సాగిపోయే ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే.
ఆహా (aha) లో
ఈ తమిళ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ పేరు ‘ అధర్మ కథైగల్’ (Adharma Kadhaigal). 2024 లో వచ్చిన ఈ మూవీకి కామరాజ్ వెల్ రచన మరియు దర్శకత్వం వహించాడు. ఇది నాలుగు రివెంజ్ కథల చుట్టూ తిరుగుతుంది. వెట్రి, సాక్షి అగర్వాల్, అమ్ము అభిరామి, ధివ్యా దురైసామి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం శివ, నందిని, దివ్య, ఒక మిస్టీరియస్ వృద్ధుడి జీవితాలను అనుసరిస్తుంది. ఈ మూవీ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
నందిని స్టోరీ : నందిని ఒక నర్సుగా పని చేస్తూ ఉంటుంది. ఒక గ్యాంగ్ స్టర్ ఆమె పని చేసే హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. అతని పై ముగ్గురు వ్యక్తులు ఎటాక్ చేస్తారు. అయితే అతని వల్ల ఈ నర్స్ గతంలో అన్యాయానికి గురైఉంటుంది. డానికి ప్రతీకారం తీర్చుకోవడానికి పథకం వేస్తుంది. హాస్పిటల్లో నే అతన్ని చంపే ప్రయత్నం చేస్తుంది. ఒక ఇంజక్షన్ వేసి చంపేస్తుంది.
యువకుడి స్టోరీ: ఒక డిప్రెస్డ్ యువకుడు ఆన్‌లైన్ రమ్మీ గేమ్‌లకు బానిస అవుతాడు. దీనివల్ల అతని జీవితం నాశనమవుతుంది. డబ్బు కోసం అతను తప్పుడు మార్గాలను ఎంచుకుంటాడు. ఒక బాలికను కిడ్నాప్ చేస్తాడు. కానీ ఆమెను భయపెట్టకూడదని కూడా కోరుకుంటాడు. ఇంతలోనే పెళ్ళికి వెళ్ళిన అతని భార్య తిరిగి వస్తుంది. ఆ పిల్లని చూసి భర్తను తిడుతుంది. పోలీసులకు చెప్తానని బెదిరిస్తుంది. భార్య భర్తల మధ్య గట్టిగా గొడవ జరగడంతో అతని భార్య ప్రమాద వశాత్తు చనిపోతుంది. అతను కూడా ఆత్మ హత్య చేసుకుంటాడు.
లోకల్ రౌడీ స్టోరీ: ఒక గ్యాంగ్‌స్టర్‌ను గుర్తు తెలియని వ్యక్తి చంపుతాడు. పోలీసులు, సైనికాధికారులు, ఇతర గ్యాంగ్‌స్టర్లపై అనుమానం వస్తుంది. కానీ హంతకుడి ఉద్దేశం ఆశ్చర్యకరంగా ఉంటుంది.
సరోగసీ స్టోరీ: సరోగసీ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. తండ్రికి ఆపరేషన్ చేయించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతలో సరోగసీ ద్వారా పిల్లల్ని కంటే డబ్బులు ఇస్తామని ఒకరు చెప్పడంతో దీనికి ఒప్పుకుంటుంది. అయితే ఆమె మానసికంగా కూడా దీనికి సిద్ధపడుతుంది. తనకు ఇలా చేస్తే పెళ్లి కాదని కొంతమంది భయపెడతారు. అయినా తన తండ్రిని బ్రతికించడం కోసం ఈ పని చేస్తుంది. ఈ కథలో ధివ్యా దురైసామి, దివంగత నటుడు పూ రాము అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. ఇలా ఈ నాలుగు స్టోరీలు విభిన్నమైన స్టోరీలతో అలరించాయి.
Read Also : అల్లుడి కోసం అత్త ఆరాటం … ఈ యవ్వారం మామూలుగా లేదురా సామీ