Toxic Glimps:ఒకప్పుడు బుల్లితెరపై టీవీ యాడ్స్ చేస్తూ.. ఒక మోస్తారు గుర్తింపు తెచ్చుకున్న హీరో యష్ (Yash)ఆ తర్వాత బుల్లితెర సీరియల్స్ చేసి తనకంటూ మంచి పేరు అందుకున్నారు. ఇక సీరియల్స్ ద్వారా వచ్చిన గుర్తింపుతో సినిమాలలోకి అడుగుపెట్టిన ఈయన కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయారు. ముఖ్యంగా కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో పాన్ ఇండియా హీరోగా అవతరించడమే కాకుండా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలుగా కూడా ఈ రెండు సినిమాలు రికార్డు సృష్టించాయి.
దీంతో కన్నడ సినీ పరిశ్రమ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇక ఈయనను ఆదర్శంగా తీసుకొని చాలామంది హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో తమ సినిమాలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈయన నటిస్తున్న చిత్రం టాక్సిక్.ఈరోజు యష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ అభిమానులు, సినీ సెలబ్రిటీలు, నెటజన్స్ సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ కి స్పెషల్ గిఫ్ట్ ఇస్తామని ఇదివరకే టాక్సిక్ టీం గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే..ఇక ఈ క్రమంలోనే తాజాగా గ్లింప్స్ విడుదల చేయగా.. ఈ గ్లింప్స్ కాస్త సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.
తాజాగా విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే.. రెట్రో కారులో క్లబ్ లోకి చాలా స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చారు. మరొకవైపు క్లబ్బులో యూత్ అంతా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన యష్.. తన వద్దకు వచ్చిన అమ్మాయితో కాస్త చనువుగా ప్రవర్తించి, ఒక బీర్ బాటిల్ తీసుకొని ఆమెపై పోస్తాడు..ఈ మేకింగ్ చూస్తుంటే రెట్రో స్టోరీ లాగా అనిపిస్తుంది. ప్రస్తుతం విడుదలైన గ్లింప్స్ కాస్త ఆసక్తిని కలిగిస్తోంది.. ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకటనారాయణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ (Kiara advani), నయనతార(Nayanthara) హీరోయిన్లుగా నటిస్తున్నట్టు ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది. ఇక ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం. దీనిని కూడా పాన్ వరల్డ్ లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తూ ఉండడం గమనార్హం.. ఏదేమైనా ఈ గ్లింప్స్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. కచ్చితంగా దీంతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటాడు అని కూడా సినీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు ఇక ఇప్పటికే కేజిఎఫ్ సినిమాలతో సంచలనం సృష్టించిన హీరో యష్ ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నారని చెప్పడంలో సందేహం లేదు మరొకవైపు లేడీ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న గీతూ మోహన్ దాస్ కూడా చాలా విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయాన్ని అందుకున్నారు.. మరి ఈ సినిమాతో ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి.