BigTV English

Canada Anita Anand: అనితా ఆనంద్.. కెనెడా ప్రధాని రేసులో దూసుకుపోతున్న భారత వనిత

Canada Anita Anand: అనితా ఆనంద్.. కెనెడా ప్రధాని రేసులో దూసుకుపోతున్న భారత వనిత

Canada Anita Anand| కెనెడా దేశ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో రెండు రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తదుపరి ప్రధాని ఎవరు కాబోతున్నారన్నేది ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పాలివర్ పియరేకు భారీ జనాదరణ లభిస్తున్నప్పటికీ ఎన్నికలు అక్టోబర్ 2025లో జరుగనున్నాయి. అప్పటివరకు లిబరల్ పార్టీ అధ్యక్షుడే ప్రధాన మంత్రి పదవి చేపట్టే అవకాశాలున్నాయి. జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీలో అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో లిబరల్ పార్టీలో అధ్యక్ష పదవికి కూడా పోటీ నెలకొంది. ఈ క్రమంలో భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ అనూహ్యంగా ముందువరుసలోకి వచ్చారు.


మార్చి 24, 2025 లోపు లిబరల్ పార్టీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగనుంది. అప్పటివరకు జస్టిన్ ట్రూడో ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా, లిబరల్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతారు. అయితే లిబరల్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రస్తుతం రవాణా, అంతర్గత వాణిజ్య మంత్రిగా ఉన్న అనితా ఆనంద్ గెలిచేందుకు ఎక్కువగా అవాకాశాలు కనిపిస్తున్నాయి. జస్టిన్ ట్రూడోకి సన్నిహితురాలైన ఆమెకు పోటీగా మరో అయిదుగురు లిబరల్ పార్టీ నాయకులు డొమినిక్ బ్లాంక్ (ఆర్థిక మంత్రి), క్రిస్టియా ఫ్రీల్యాండ్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్ ఛాంపెన్, మార్క్ కార్నీ ఉన్నారు.

అనిత ఆనంద్ లిబరల్ పార్టీలో సీనియర్ నాయకురాలు. ఆమె తొలిసారి 2019లో కెనెడా పార్లమెంటుకు ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తరువాత తక్కువ కాలంలోనే వివిధ మంత్రిత్వశాఖల్లో తన నైపుణ్యత నిరూపించుకున్నారు. 2019 నుంచి ఇప్పటివరకు పబ్లిక్ సర్వీసెస్ అండ్ ప్రొక్యూర్ మెంట్, మినిస్టర్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్, ప్రెసిడెంట్ ఆఫ్ ట్రెజరీ బోర్డ్ లాంటి కీలక పదవులు చేపట్టారు. 2024 నుంచి అనితా ఆనంద్ ట్రాన్స్ పోర్ట్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ మంత్రిగా కొనసాగుతున్నారు.


Also Read: బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాంకు చైనా స్కెచ్.. భారత్ సీరియస్!

మే 20, 1967న కెనెడాలోని కెంట్‌విల్లె, నోవా స్కాటియాలో డాక్టర్ దంపతులైన సరోజ్ డి రామ్, ఎస్ వి ఆనంద్ లకు అనితా ఆనంద్ జన్మించారు. డాక్టర్ ఆనంద్ దంపతులు 1960లో కెనెడా దేశానికి ఇండియా నుంచి వలస వెళ్లి.. అక్కడే స్థిరపడ్డారు. వీరికి మరో ఇద్దరు కుమార్తెలు.. గీతా ఆనంద్, సోనియా ఆనంద్ కూడా ఉన్నారు. 1985లో అనితా ఆనంద్ కెంట్ విల్లె నుంచి ఒంటారియాకు వెళ్లి.. అక్కడ పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఆనర్స్) పూర్తి చేశారు. అంతటితో ఆగకుండా యూనివర్సిటీ ఆఫ్ టొరొంటోలు మాస్టర్స్ లా డిగ్రీ సంపాదించారు.

ఆ తరువాత ఆమె కెరీర్ లో టీచర్ గా చాలా కాలంపాటు పనిచేశారు. ప్రఖ్యాత యేల్ లా స్కూల్ లో ఆమె బోధించారు. యూనివర్సిటీ ఆఫ్ టొరొంటో లో కూడా లా ప్రొఫెసర్ గా ఉద్యోగం చేశారు. ఆర్థికం రంగంలో కూడా ఆమె మంచి పట్టు సాధించారు.

1995లో కెనెడాకు చెందిన ఒక లాయర్ జాన్ నోల్‌టన్ ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు. 2019లో ఆమె రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. 21 ఏళ్లుగా ఆమె ఓక్ విల్లెలో నివసించారు. అందుకే 2019లో ఓక్ విల్లె నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.

ఆ తరువాత కేవలం గత 5 ఏళ్లలోనే రాజకీయాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధఇంచారు. కోవిడ్ -19 సమయంలో ఆమె కెనెడా పబ్లిక్ సర్వీస్ మినిస్టర్ పదివిలో ఉన్నప్పడు ఆక్సిజన్ సరఫరా, మాస్క్ లు, వ్యాక్సిన్ పంపిణీ, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో ఆమె పనితీరుకి మంచి గుర్తింపు వచ్చింది. 2021లో ఆమె రక్షణ మంత్రిగా ఉన్నప్పుుడ .. కెనెడా మిలిటరీలో ఎన్నో సంస్కర్ణలు తీసుకువచ్చారు. ఉక్రెయిన్ కు సైనిక మద్దతు సరఫరా చేయడం, మిలిటరీలో కొంత మంది సైనికులు అత్యాచారాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.

ఆ తరువాత రవాణా శాఖ మంత్రిగా కూడా ఆమె పర్యవేక్షణలో కెనెడాలోని రోడ్లు, హైవేలు, రైల్వేకు సంబంధించిన ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల నిర్మాణం జరిగాయి. కెనెడాలో కాలుష్య రహిత గ్రీన్ ఎనర్జీ ఉండాలని ఆమె ట్రాన్ పోర్ట్ రంగంలో కూడా కీలక మార్పులు తీసుకొచ్చారు. తను చేపట్టిన ప్రతి రంగంలో ఆమె సూపర్ అనిపించుకున్నారు.

ఒకవేళ అనితా ఆనంద్ కెనెడా ప్రధాన మంత్రి పదవి చేపడితే.. ఆమె కెనెడా దేశ రెండో మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టిస్తారు. ఇంతకుముందు 1993లో కెనెడాకు చెందని ప్రొగ్రెసివ్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన కిమ్ క్యాంప్ బెల్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. లిబరల్ పార్టీ తరపున ఇప్పటి వరకు ఒక్కరు కూడా మహిళా ప్రధాని కాలేదు.

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×