BigTV English

CSK : చెన్నై గెలుపు.. ‘2010’ రిపీట్ కానుందా?

CSK : చెన్నై గెలుపు.. ‘2010’ రిపీట్ కానుందా?

CSK : చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొన్న లక్నో సూపర్ జెయింట్స్ తో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ లో విజయం సాధించిన చెన్నై.. ఆ తరువాత లక్నో మ్యాచ్ తో మాత్రమే విజయం సాధించింది. ఆ మధ్య లో 5 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఐపీఎల్ 2025లో సీఎస్కే మళ్లీ పుంజుకుంటుందా..? అనే ఆశలు చిగురించాయి. ఫ్యాన్స్ 2010 సీజన్ ను గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు కూడా ఇలాగే మొదలైంది కానీ చివర్లో చెన్నై సూపర్ కింగ్స్ విశ్వరూపం చూపించి మొదటి ఐపీఎల్ టైటిల్ కొట్టేసింది.  ఇప్పుడు మళ్లీ ఇలాంటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


2010 చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రారంభంలో ఏమాత్రం బాగా లేదు. ఆడిన మొదటి 7 మ్యాచ్ లలో కేవలం రెండే గెలిచింది. కానీ ఆ తరువాత సొంతగడ్డ పై వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి ఫైనల్ కి దూసుకెళ్లి టైటిల్ కొట్టేసింది. అప్పట్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ధోనీ లాస్ట్ ఓవర్ లో కొట్టిన సిక్స్ లు ఎప్పటికీ ఎవ్వరూ మరిచిపోలేరు. ఆ మ్యాచ్ గురించి ధోనీనే స్వయంగా తన కెరీర్ లోనే చాలా ఎమోషనల్ మూమెంట్ అని చెప్పుకొచ్చాడు. 2025 లో సీఎస్ కే మరింత ఘోరంగా స్టార్ట్ చేసింది. తొలి 6 మ్యాచ్ లలో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఐపీఎల్ హిస్టరీలోనే ఇది సీఎస్కే కు వరస్ట్ స్టార్ట్.. కానీ లక్నో తో జరిగిన మ్యాచ్ లో గెలిచాక మళ్లీ ఆశలు రేగాయి.

మరోవైపు అభిమానులు 2010లో జరిగిన రికార్డును మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఒక చిక్కు ఉందండోయ్.. అది ఏంటంటే..? చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రన్ రేట్ 1.276 దగ్గర ఉండటం మైనస్ అనే చెప్పాలి. వాస్తవానికి 14 మ్యాచ్ లలో  9 గెలిస్తే.. ప్లే ఆప్స్ కి వెళ్లడం పెద్ద కష్టమేమి కాదు. కానీ ప్రతీ మ్యాచ్ లోనూ భారీ తేడాతో గెలవాలి. అది కొంచెం కష్టమైన పనే అని చెప్పాలి. ముంబై ఇండియన్స్, హైదరాబాద్ తో జరగబోయే మ్యాచ్ లు చెన్నై సూపర్ కింగ్స్ చాలా కీలకం అనే చెప్పాలి. ఈ మ్యాచ్ ల్లో గెలిస్తేనే చెన్నై జట్టు ప్లే ఆప్స్ రేసులో నిలబడతారు.


ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఎప్పుడూ ప్రెజర్ లో ఆద్భుతంగా ఆడుతుంది. 2023 ఫైనల్ లోరవీంద్ర జడేజా లాస్ట్ బాల్ కి హీరో అయిపోయాడు. గుజరాత్ టైటాన్స్ పై లాస్ట్ బాల్ కి టైటిల్ కొట్టాడు. ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ ఇంజ్యూర్ కావడంతో ధోనీ మళ్లీ కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ చాలా ఇంప్రూవ్ కావాలి. 180 టార్గెట్స్ ఛేజింగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ స్టైక్ రేట్ చాలా తక్కువగా ఉందనే చెప్పాలి. ఇటీవల కేకేఆర్ తో మ్యాచ్ లో 103/9 కుప్పకూలడం చూస్తే.. బ్యాటింగ్ ఎంత వీక్ ఉందో అర్థం చేసుకోవచ్చు. #CSK2025 comeback అనే హ్యాష్ ట్యాగ్  సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.

Related News

Shahid Afridi: క్రికెట్ వ‌దిలేసి, కిచెన్ లో వంట‌లు చేసుకోండి..మ‌హిళ‌ల జ‌ట్టును అవ‌మానించిన‌ అఫ్రిది

Pakistan Players: రిజ్వాన్ ఇంట పెళ్లి సందడి.. త‌మ‌న్నా పాట‌ల‌కు స్టెప్పులేసిన‌ పాక్ ప్లేయ‌ర్లు

India Schedule: 2026 వ‌ర‌కు వ‌రుస‌గా మ్యాచ్ లే…ప్లేయ‌ర్ల‌కు రెస్ట్ కూడా లేదు..టీమిండియా కొత్త షెడ్యూల్ ఇదే

Kranti Goud: మ‌గాడిలా ఉందంటూ ట్రోలింగ్‌..కానీ పాకిస్థాన్ పై బుమ్రాలా రెచ్చిపోయింది

Harmanpreet Kaur: దొంగ చూపుల‌తో బెదిరింపులు..బండ బూతులు తిట్టిన‌ హ‌ర్మ‌న్ ప్రీత్‌

Muneeba Run-Out: మునీబా రనౌట్ పై వివాదం..అంపైర్ తో పాక్ కెప్టెన్‌ గొడ‌వ‌, అస‌లు రూల్స్ ఏం చెబుతున్నాయి

Shoaib Akhtar: మా పురుషుల జ‌ట్టును పాకిస్థాన్ మ‌హిళలే చిత్తుగా ఓడిస్తారు..అంత ద‌రిద్రంలో ఉన్నాం

IND VS PAK Women: వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాక్ మ‌రో ఘోర ఓట‌మి.. టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Big Stories

×