Brahmamudi serial today Episode: ఆస్తి విషయంలో కళ్యాణ్‌ను కన్వీన్స్ చేయాలని చూస్తుంది ధాన్యలక్ష్మీ. ఇప్పటికైనా మన వాటా మనం తీసుకుని ఇక్కడి నుంచి బయటపడకపోతే ఆ వంద కోట్ల అప్పు మన మెడకు చుట్టుకుంటుంది. బంధాలు, బంధుత్వాలు సినిమాల్లోనే ఉంటాయి. నిజజీవితంలో ఉండవు.. అంటూ చెప్పి వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మీ. దీంతో కళ్యాణ్ ఏంటి నాన్నా అమ్మ అలా మాట్లాడుతుంటే నువ్వు ఒక్క మాట కూడా అనవేంటి అంటాడు. ఇన్ని రోజులు నేను కూడా మా అన్నదారిలోనే నడిచాను. కానీ ఇంట్లో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే.. నువ్వు నాలాగా మాత్రం ఉండొద్దని చెప్పగలను అంటూ వెళ్లిపోతాడు.
రాహుల్, రుద్రాణి ఇద్దరూ కలిసి స్వప్న దగ్గరకు వెళ్తారు. పాప నిద్రపోతుందా..? అని అడుగుతారు. దీంతో స్వప్న ఈ వయసులో నిద్రపోకా మీలా ఎవరి గురించి ఎవరికి చాడీలు చెబుదామా..? అని ఆలోచిస్తుందా..? అంటుంది. రుద్రాణి కూల్‌గా మేము ఇప్పుడు ఏమన్నామని కౌంటర్లు.. ఎన్‌కౌంటర్లు వేస్తున్నావు అంటుంది. మనల్ని చూస్తూనే దీనికి నెగటివ్ వైబ్స్ వస్తావేమో మామ్ అంటాడు రాహుల్. దీంతో స్వప్న నా సంగతి అటు ఉంచండి.. మీరు మళ్లీ ఎందుకొచ్చారు. నా చెల్లి కావ్య గురించి నన్ను రెచ్చగొట్టడానికి వచ్చారా..? అని అడుగుతుంది. దీంతో రుద్రాణి రెచ్చగొట్టడం కాదు. కళ్లు తెరిపించడం కోసం వచ్చాము అంటూ కావ్య, రాజ్ చేసిన వంద కోట్ల అప్పు గురించి చెప్తారు. ముసలాయన నీకు ఇచ్చిన ప్రాపర్టీ కూడా అమ్ముకునే పరిస్థితి వస్తుంది అని చెప్పి వెళ్లిపోతారు. స్వప్న ఆలోచనలో పడిపోతుంది.
హాస్పిటల్‌లో ఉన్న సీతారామయ్య దగ్గరకు వెళ్లిన ఇందిరాదేవిని చూసి సీతారామయ్య చిట్టి ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు. అబ్బే అదేం లేదే నేను బాగానే ఉన్నానే అంటుంది ఇందిర. దీంతో చిట్టి నేను నీతో 60 ఏళ్లు కాపురం చేశాను. నీ ముఖం చూసి ఎలా ఉన్నావో ఆ మాత్రం తెలుసుకోలేనా..? అంటాడు. దీంతో తర్వాత చెప్తాను బావ.. డాక్టర్ నిన్ను రెస్ట్ తీసుకోమన్నారు అని చెప్తుంది. అంత గండాన్నే దాటుకుని వచ్చాను నువ్వు నిజం చెబితే తట్టుకునే గుండె ధైర్యం నాకుంది చెప్పు అని అడుగుతాడు. దీంతో ఇంట్లో జరిగిన విషయాలు మొత్తం చెప్తుంది ఇందిరాదేవి. రాజ్ వంద కోట్లు అప్పు చేశాడని చెప్పగానే.. సీతారామయ్య ఆశ్చర్యపోతాడు. రాజ్ వంద కోట్లు అప్పు చేశాడనడానికి ఆధారం ఉందా..? అని అడుగుతాడు. లేదు బావ కానీ ఆ అనామిక వచ్చి చెబితేనే మాకు తెలిసింది అని చెప్తుంది. దీంతో సీతారామయ్య ఆలోచనలో పడిపోతాడు.
పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు వ్యక్తులను తీసుకుని వచ్చి ఇంటరాగేషన్ చేస్తుంటే. అప్పు వస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతుంది. గుడిలో దొంగతనం జరిగింది. పూజారి గుడి మూసే టైంలో వీళ్లిద్దరే అక్కడ ఉన్నారు అందుకే తీసుకొచ్చి నిజం చెప్పిస్తున్నాము అని పోలీస్ చెప్పగానే.. అప్పు చిన్న నాటకం ఆడి దొంగ ఎవరో కనిపెడుతుంది. అక్కడున్న పోలీసులు షాక్ అవుతారు.
అందరూ హాల్లో కూర్చుని ఉండగా.. బ్యాంకు వాళ్లు వస్తారు. రుద్రాణి హలో ఎవరు మీరు ఇంట్లోకి వస్తున్నారు అని అడుగుతుంది. మీరు ఇంట్లోంచి బయటకు వెళ్లే టైం వచ్చింది అని చెప్తారు. ఇంతలో రాజ్, కావ్య వస్తారు. సార్ మీరేంటి ఇక్కడికి వచ్చారు అని రాజ్ అడగ్గానే.. తప్పలేదు మిస్టర్ రాజ్ మీరు చెల్లిస్తానన్న వంద కోట్లు గడువులోపల చెల్లించలేదు. కాబట్టి జప్తు నోటీసు ఇచ్చి వెళ్దామని వచ్చాం అని చెప్తారు. సార్ మేము 25 కోట్లు కట్టాము కదా..? అని రాజ్ అడగ్గానే.. మిగతా అమౌంట్ కోసం మేము రెండు సార్లు నోటీసు ఇచ్చాం. కానీ మీ నుంచి రెస్పాండ్ లేదు అని చెప్తారు. ఇంతలో ధాన్యలక్ష్మీ.. ఏంటి ఇల్లు జప్తు చేస్తారా..? విన్నారా..? నేను మొదటి నుంచి చెప్తున్నాను.. ఎవ్వరూ వినలేదు. ఇప్పుడు కట్టుబట్టలతో రోడ్డు మీదకు గెంటేస్తారు అంటుంది. రుద్రాణి కూడా కోపంగా ఇలాంటిదేదే జరగుతుందనే.. పనిలో పనిగా నేను కూడా ఆస్థి రాయించుకోవాలనుకున్నాను. అందరినీ హెచ్చరిస్తూనే ఉన్నాను.
ఈ కుటుంబాన్ని నమ్ముకున్నందుకు నాకేం మిగిల్చారు అంటుంది. ధాన్యలక్ష్మీ.. అసలు ఆ అప్పుతో మాకెలాంటి సంబంధం లేదు. ఇల్లు ఎలా జప్తు చేస్తారు అని అడుగుతుంది. దీంతో బ్యాంకు వాళ్లు ఆస్థి ఎవరి పేరు మీద ఉంది అని అడుగుతారు. కావ్య పేరు మీద ఉందని ప్రకాష్ చెప్తాడు. మరి ఆవిడే అప్పు కడతానని సంతకం చేశారు అని బ్యాంకు వాళ్లు చెప్తారు. దీంతో అపర్ణ కోపంగా రాజ్ అసలేం జరుగుతుంది అని అడుగుతుంది. రుద్రాణి మరింత వెటకారంగా అసలు వంద కోట్ల డబ్బును ఎక్కడ దాచారు. కనకం పేరు మీద ఎన్ని కోట్లు వేశారు. కృష్ణమూర్తి పేరు మీద ఎంత దాచారు.
అవన్నీ ఇప్పుడే బయటకు తీసి బ్యాంకుకు కట్టేయాలి అని చెప్పగానే సుభాష్ కోపంగా రుద్రాణి నా కొడుకు కోడలు ఒక్క రూపాయి కూడా అప్పు చేయలేదు. కావాలంటే బ్యాంకు వాళ్లనే అడగు అంటూ ఏంటి ఆఫీసర్స్ రాజ్ కానీ కావ్య కానీ మీ బ్యాంకులో అప్పు చేశారా..? అని అడగ్గానే.. బ్యాంకు వాళ్లు చేయలేదని చెప్తారు. సుభాష్ అసలు నిజం చెప్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. అపర్ణ హ్యాపీగా ఫీలవుతుంది. రుద్రాణి, దాన్యలక్ష్మీ మాత్రం మళ్లీ రాజ్, కావ్యలను తిడుతూ.. మీరేమైనా చేసుకోండి ఆస్థిలో మా వాటా మాకు ఇవ్వండి అని అడుగుతారు. అందరూ గొడవ పడుతుంటారు. ఇంతలో ఆపండి అంటూ సీతారామయ్య, ఇందిరాదేవి వస్తారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?