Hari Hara VeeraMallu : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఒకవైపు సినిమాల్లోనూ మరోవైపు రాజకీయాల్లోనూ ప్రస్తుతం చాలా బిజీగా మారాడు పవన్ కళ్యాణ్. సినిమాల్లో వరుసగా హిట్ సాధిస్తూ కెరియర్ పీక్ లో ఉన్న టైంలో 2014లో జనసేన అనే పార్టీని స్థాపించాడు పవన్ కళ్యాణ్. ఆ పార్టీని స్థాపించిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా నిలిచి అధికారంలోకి రావడానికి సహాయపడ్డాడు. ఆ తర్వాత 2019లో ఒంటరిగా పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్. అయితే అక్కడితో ఆగకుండా అలుపెరగని పోరాటం చేసి నేడు 100% సక్సెస్ రేట్ తో ఆంధ్రప్రదేశ్ లో తన సత్తా చాటారు. డిప్యూటీ సీఎం అయిపోయిన కూడా తనకు సినిమా కష్టాలు తప్పడం లేదు.
చాలా ఏళ్లు తర్వాత స్ట్రైట్ ఫిలిం
అజ్ఞాతవాసి అనే సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు కొంత కాలం పాటు గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ చొరవతో వకీల్ సాబ్ అనే సినిమాకి సైన్ చేసి రీఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకేసారి దాదాపు 5, 6 సినిమాలను లైన్లో పెట్టారు, వాటిలో మూడు సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి. ఇంకో మూడు సినిమాలు లైన్ అప్ లో ఉన్నాయి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ చాలాకాలం తర్వాత చేస్తున్న స్ట్రైట్ ఫిలిం కాబట్టి ఈ సినిమా మీద మరిన్ని అంచనాలు ఉన్నాయి.
90% హైలెట్ సీన్స్ దాచేసారు
హరిహర వీరమల్లు సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అని అప్పట్లో ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ విపరీతమైన బజ్ ఉంటుంది. కానీ ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి హడావిడి లేకుండా పోయింది. ఇక దీనిపై రీసెంట్గా నిధి అగర్వాల్ స్పందించారు. నిధి మాట్లాడుతూ ఏ ఫిలిం మేకర్ అయినా కూడా ఆ సినిమాలోని హైలెట్ షాట్స్ని ట్రైలర్ లో పెడతారు.
కానీ ఈ సినిమా నిర్మాత ఏం రత్నం కొంచెం డిఫరెంట్. సినిమాలో 90% హైలెట్ సీన్స్ ను బయటికి రాకుండా చేసేశారు. థియేటర్కు వచ్చిన ఆడియన్స్ కి ఇవి డెఫినెట్ గా సర్ప్రైజింగ్ గా అనిపిస్తాయి. ఆయనకంటూ ఒక స్ట్రాటజీ ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇది కూడా ఒకరకంగా వాస్తవం అనే చెప్పాలి. కొన్నిసార్లు ఎటువంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళ్ళినప్పుడు, ఆ సినిమా హై ఇస్తే దానికి కలెక్షన్లు కూడా వేరే రేంజ్ లో ఉంటాయి.
Also Read: Aditi Shankar : అందుకే నేను ఆయనను బెల్లం గారు అని పిలుస్తా