Bollywood : బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. హిందీ యంగ్ యాక్టర్ నితిన్ చౌహాన్ (Nitin Chauhaan) ఆత్మహత్య వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ‘దాదాగిరి 2’ రియాల్టీ షో విజేతగా నిలిచిన హిందీ టీవీ నటుడు నితిన్ చౌహాన్ (Nitin Chauhaan) గురువారం ముంబైలో మరణించారు. అతని వయస్సు కేవలం 35 సంవత్సరాలు. యుపిలోని అలీఘర్ జిల్లాకు చెందిన నితిన్, MTV షో ‘స్ప్లిట్స్‌విల్లా సీజన్ 5’ విన్నర్ గా నిలిచారు. అంతేకాకుండా అతను జిందగీ.కామ్, క్రైమ్ పెట్రోల్, ఫ్రెండ్స్ వంటి సీరియల్స్‌లో కూడా కనిపించాడు. క్రైమ్ పెట్రోలింగ్‌తో అతను చాలా ఫేమస్ అయ్యాడు.
నితిన్ (Nitin Chauhaan) చివరిసారిగా 2022లో SAB TV ‘తేరా యార్ హూన్ మైన్’ షోలో కనిపించాడు. షోలో అతనితో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్న సహ నటులు సుదీప్ సాహిర్, సయంతని ఘోష్ అతని మరణ వార్తను ధృవీకరించారు. అయితే తమకు దీనిపై ఎలాంటి తదుపరి సమాచారం లేదని చెప్పారు. మరో నటి విభూతి ఠాకూర్ పోస్ట్ ప్రకారం నితిన్ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం ప్రకారం నితిన్ తండ్రి అతని మరణ వార్త అందుకున్న తర్వాత ముంబై చేరుకున్నాడు. అతని మృతదేహాన్ని తిరిగి అలీఘర్‌కు తీసుకువెళతారు. ప్రస్తుతం దీనిపై పోలీసుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. పోలీసులు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు.
టీవీ నటి విభూతి ఠాకూర్ నితిన్ (Nitin Chauhaan) మరణ వార్త తెలిసిన వెంటనే అతని కోసం భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు. ‘మీ ఆత్మకు శాంతి చేకూరాలి. ప్రతి కష్టాన్ని ఎదుర్కొనే శక్తి నీకు ఉందని. మీరు మానసికంగా మీ శరీరం వలె బలంగా ఉన్నారని నేను అనుకున్నాను’ అంటూ పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ తో నితిన్ ఆత్మహత్య చేసుకున్నాడు అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అలాగే నటుడు సుదీప్ సాహిర్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో తన సహనటుడికి నివాళులర్పిస్తూ, “రెస్ట్ ఇన్ పీస్ ఫ్రెండ్” అని రాశారు.
నితిన్ (Nitin Chauhaan) మరణవార్త విన్న తరువాత ఇప్పుడు ప్రతి ఒక్కరూ అతను ఎలా చనిపోయాడో తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే దాని గురించి ఇంకా పెద్ద సమాచారం అందుబాటులో లేదు. సడన్ గా నితిన్ మరణవార్త విన్న అభిమానులు షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో నటుడికి నివాళులు అర్పిస్తున్నారు.
ఇదిలా ఉండగా మరో షాకింగ్ విషయం ఏమిటంటే నితిన్ (Nitin Chauhaan) తన పుట్టినరోజుకు ముందే చనిపోవడం. నితిన్ చౌహాన్ త్వరలో తన 36వ పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు. అయితే దీనికి వారం రోజుల క్రితమే ఆయన మరణించారు.
బాలీవుడ్ లో వరుసగా ఇలాంటి షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం. ఇటీవలే మలైకా అరోరా ఖాన్ తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఘటనను మరవక ముందే మరో బాలీవుడ్ స్టార్ (Nitin Chauhaan) ఇలా అర్ధాంతరంగా కన్ను మూయడం బాలీవుడ్ మూవీ లవర్స్ ను ఆందోళనకు గురి చేస్తోంది.