Homemade Face Cream: గులాబీ పూలలో ఉండే కాంపౌండ్స్ చర్మానికి చాలా మేలు చేస్తాయి. వీటితో తయారుచేసిన ఫేస్ క్రీమ్ ముఖానికి అద్భుతమైన మెరుపును తీసుకువస్తుంది. చలికాలంలో మీ ముఖ చర్మాన్ని అందంగా ఉంచుకోవాలనుకుంటే రు ఇంట్లోనే గులాబీ పూలతో ఫేస్ క్రీమ్ తయారు చేసుకొని వాడాలి. గులాబీ పూలతో తయారు చేసిన ఫేస్ క్రీమ్ ముఖానికి అద్భుతమైన మెరుపును తెస్తుంది. అంతే కాకుండా ముఖానికి స్వచ్చమైన మెరుపును తెస్తుంది.
గులాబీ ఫేస్ క్రీమ్:
గులాబీ పూవుతో తయారు చేసిన ఫేస్ క్రీమ్ సహజమైంది. ఇది చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మాన్ని మృదువుగా, మెరుస్తూ, యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి.
రోజ్ ఫేస్ క్రీమ్ చేయడానికి కావలసినవి:
తాజా గులాబీ పూలు – 1 కప్పు
తేనె – 1 టీస్పూన్
ఆల్మండ్ ఆయిల్ – 1 టీస్పూన్
అలోవెరా జెల్ – 1 టీస్పూన్
విటమిన్ ఇ క్యాప్సూల్ – 1
ఫేస్ క్రీమ్ తయారు చేసే విధానం:
గులాబీ రేకులను కడిగి ఆరబెట్టండి: తాజా గులాబీ పూల రేకులను బాగా కడిగి నీడలో ఆరబెట్టండి.
గులాబీ రేకులను గ్రైండ్ చేయండి: ఎండిన గులాబీ రేకులను మిక్సీలో వేసి పౌడర్‌లా చేసుకోవాలి.
అన్ని పదార్థాలను కలపండి: రోజ్ పౌడర్, తేనె, బాదం నూనె, అలోవెరా జెల్, విటమిన్ ఇ క్యాప్సూల్ నూనెను ఒక గిన్నెలో తీసుకుని, వాటన్నింటినీ బాగా కలపండి.
క్రీమ్‌ను సిద్ధం చేయండి: ఈ మిశ్రమాన్ని మృదువుగా అయ్యే వరకు కలపండి. ఈ క్రీమ్‌ను గాలి చొరబడని కంటైనర్‌లో నింపి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయండి.
Also Read: డార్క్ సర్కిల్స్ తగ్గించే మార్గాలివే!
ఫేస్ క్రీమ్ అప్లై చేసే విధానం, ప్రయోజనాలు:
రాత్రి పడుకునే ముందు మీ ముఖాన్ని శుభ్రం చేసి, ఈ క్రీమ్‌ను అప్లై చేయండి. ఉదయం నిద్రలేచిన తర్వాత ముఖం కడుక్కోవాలి. ఈ ఫేస్ క్రీమ్ చాలా ప్రభావవంతమైంది. దీన్ని తరుచుగా అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది.
రోజ్ ఫేస్ క్రీమ్ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇది స్కిన్ టోన్‌ని సమానంగా చేస్తుంది. అంతే కాకుండా మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. చర్మానికి యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది. దీనిని ముఖానికి అప్లై చేయడం వల్ల సూర్యుని హానికరమైన కిరణాల నుండి చర్మం రక్షించబడుతుంది. అంతే కాకుండా ఈ క్రీం తరుచుగా వాడటం వల్ల ముఖం తెల్లగా మారుతుంది. గ్లోయింగ్ స్కిన్ కూడా మీ సొంతం అవుతుంది. బయట మార్కెట్‌లో దొరికే ఫేస్ క్రీంలను రసాయనాలతో తయారు చేస్తారు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకే ఇంట్లోనే గులాబీలతో ఈ ఫేస్ క్రీం తయారు చేసుకుని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని పోషకాలు చర్మాన్ని అందంగా మారుస్తాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.