Udayabhanu: ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్తవారు యాంకర్లుగా ఇండస్ట్రీకి పరిచయమవుతూ కెరియర్ పరంగా వరుస ఈవెంట్లు ఇతర కార్యక్రమాలు అంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిమేల్ యాంకర్స్ ఎంతోమంది ఉన్నారు. అయితే ఒకప్పుడు టాలీవుడ్ యాంకర్ అంటే మాత్రం అందరికీ తక్కున ఉదయభాను(Udaya Bhanu) గుర్తుకు వచ్చేవారు. ఇలా ఉదయభానుతోపాటు తర్వాత ఝాన్సీ, సుమ వంటి వారు కూడా యాంకరింగ్ లో ఎంతో ఫేమస్ అయ్యారు. అప్పట్లో ఏకార్యక్రమం ప్రసారం కావాలన్న తప్పనిసరిగా ఉదయభాను ఆ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించాల్సిందే.
తొక్కేసే ప్రయత్నాలు..
ఇలా వరుస ఈవెంట్ లు, సినిమాలు అంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఉదయభాను ఇటీవల కాలంలో పూర్తిగా ఈవెంట్లు చేయడం తగ్గించారు. అయితే అవకాశాలు లేక ఈమె ఈవెంట్లు చేయటం లేదని, కొందరు ఉద్దేశం పూర్వకంగానే తనకు అవకాశాలు ఇవ్వకుండా ఇండస్ట్రీలో తొక్కేయాలని చూస్తున్నారు అంటూ పలు సందర్భాలలో ఉదయభాను తెలియజేశారు. ఇలా ఒక కార్యక్రమానికి నన్ను యాంకర్ గా ఎంపిక చేసినా, మరుసటి రోజు ఆ కార్యక్రమం జరిగే సమయానికి తాను అక్కడ ఉండట్లేదని తెలిపారు. తన స్థానంలో మరొకరు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు అంటూ పలు సందర్భాలలో ఉదయభాను తెలియజేశారు.
ఇండస్ట్రీలో సిండికేట్ పెరిగిపోయింది…
తాజాగా సుహాస్(Suhas) హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామ (oo Bhama Ayyo Rama)సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఉదయభాను యాంకర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించిన ఓ వ్యక్తి ఉదయభాను గురించి మాట్లాడుతూ తిరిగి ఉదయభాను గారు ఇలా ఈవెంట్లు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఆయన అలా మాట్లాడుతుండగానే ఉదయభాను స్పందిస్తూ… ఈ ఈవెంట్ ఒక్కటే చేశానండి మళ్లీ రేపు ఈవెంట్ అంటే చేస్తానో, లేదో కూడా తెలియదు, ఇక్కడ సిండికేట్ అంతలా పెరిగిపోయింది అంటూ ఈమె షాకింగ్ కామెంట్ చేశారు. దీంతో ఉదయభాను ఏ ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి.
అవకాశాలు రానివ్వడం లేదా…
ఇలా యాంకరింగ్ లో కూడా సిండికేట్ పెరిగిపోయింది అంటే కొందరు ఉద్దేశం పూర్వకంగానే ఇండస్ట్రీలో ఇతరులకు అవకాశం రాకుండా చేస్తున్నారని ముఖ్యంగా ఆమె విషయంలో కూడా అదే జరుగుతున్న నేపథ్యంలోనే ఇలా ఓపెన్ అయ్యారని తెలుస్తోంది. ఒకానొక సమయంలో యాంకర్ గా ఎంతో బిజీగా ఉన్నా ఉదయభాను ప్రస్తుతం మాత్రం అవకాశాలు లేకుండా ఉన్నారు. ఏదో అడపాదడపా సినిమా ఈవెంట్లు చేస్తున్నారు. అలాగే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు తన పిల్లలకు సంబంధించిన విషయాలను అందరితో షేర్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే తనకు అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉండట్లేదని అవకాశాలు రానివ్వకుండా చేస్తున్న నేపథ్యంలోనే ఉదయభాను ఇండస్ట్రీకి దూరమయ్యారని మరోసారి స్పష్టమవుతుంది. ఏది ఏమైనా ఉదయభాను చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం మరోసారి ఇండస్ట్రీలో చర్చలకు కారణం అవుతున్నాయి.
Also Read: ఫేక్ కలెక్షన్స్ పోస్టర్ అందుకే వేస్తారా.. గుట్టు రట్టు చేసిన దిల్ రాజు?