BigTV English

Unstoppable Ram Charan Part 2: అమ్మాయిలతో అలా చేస్తాడు.. రామ్ చరణ్ పరువు తీసిన ఫ్రెండ్స్

Unstoppable Ram Charan Part 2: అమ్మాయిలతో అలా చేస్తాడు.. రామ్ చరణ్ పరువు తీసిన ఫ్రెండ్స్

Unstoppable Ram Charan Part 2: బాలకృష్ణ హోస్ట్‌గా ‘అన్‌స్టాపబుల్’ అనే టాక్ షో ప్రారంభించినప్పటి నుండి ఇందులో గెస్టులుగా ఎంతోమంది సెలబ్రిటీలు వచ్చారు. తన షోకు ఎవరు గెస్టులుగా వచ్చినా వారితో బాలయ్య ఫ్రెండ్లీగా కలిసిపోయి వారి పర్సనల్ విషయాలు అన్నీ బయటికి లాగుతారు. తాజాగా ‘అన్‌స్టాపబుల్ 4’లోకి గెస్టుగా రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే రామ్ చరణ్ ఎంట్రీకి సంబంధించిన ఒక ఎపిసోడ్ విడుదలయ్యింది. దీనికి రెండో భాగం కూడా ఉందని మేకర్స్ అప్పుడే ప్రకటించారు. తాజాగా ఈ రెండో భాగానికి సంబంధించిన ప్రోమో బయటికొచ్చింది.


అకీరా లాంచ్

పవన్ కళ్యాణ్ మ్యానరిజంను రామ్ చరణ్ ఇమిటేట్ చేయడంతో ఈ ప్రోమో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ఆద్య ఉన్న ఫోటోను తనకు చూపించడంతో అందులో అకీరా నందన్ మిస్సింగ్ అని అంటాడు. దీంతో ఎడిటింగ్‌లో ఆ ఫోటో కూడా యాడ్ అవుతుంది. ఆపై అకీరా సినీ ఎంట్రీ గురించి రామ్ చరణ్ ఏదో ఆసక్తికర విషయం రివీల్ చేస్తున్నట్టుగా ప్రోమోలో చూపించారు. ఆ తర్వాత ఉపాసనతో తన పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకున్నాడు. ‘‘మొదట్లో మేము అసలు మాట్లాడుకునే వాళ్లం కాదు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. పడిపోయాను’’ అని చెప్తూ సిగ్గుపడ్డాడు రామ్ చరణ్.


ప్రభాస్‌తో పరాచకాలు

ఉపాసన తనను ప్రేమగా ఏమని పిలుస్తుంది అని అడగగా.. రామ్ చరణ్ (Ram Charan) అని పిలుస్తుందని అన్నాడు. కోపమొస్తే టోన్ మాత్రమే మారుతుందని చెప్పాడు. ఆ తర్వాత కాసేపు ప్రభాస్‌కు కాల్ చేసి కబుర్లు చెప్పారు. గనపవరం అమ్మాయిని చేసుకుంటున్నావని చరణ్ చెప్పాడు అనగానే అది యూరోప్‌లో ఉందా అని అడిగాడు ప్రభాస్. దీంతో అందరూ నవ్వారు. చిన్నప్పుడు తన బాబాయ్ నాగబాబు వల్లే తన తండ్రి ఒకసారి కొట్టాడని గుర్తుచేసుకున్నాడు చరణ్. ఈ షోలో రామ్ చరణ్‌తో పాటు తన ఇద్దరు ఫ్రెండ్స్ కూడా పాల్గొన్నట్టు ప్రోమోలో చూపించారు. అందులో ఒకడు శర్వానంద్. ఆ ముగ్గురు ఎక్కువగా ఫ్లర్ట్ చేసేది ఎవరు అని అడగగానే వెంటనే రామ్ చరణ్ పేరు చెప్పాడు శర్వా.

Also Read: పుంజుకున్న గేమ్ చేంజర్ కలెక్షన్లు.. 6 రోజులకే ఆ రికార్డ్ బ్రేక్..?

నమ్మదగిన ఫ్రెండ్

ఎవరికి ఎక్కువ గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు అని బాలయ్య అడగగా.. వెంటనే శర్వానంద్ పేరు చెప్పారు. ఆ ఆట పూర్తయ్యే సమయానికి ముగ్గురూ దొంగలే అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు బాలయ్య. ఆ ముగ్గురికి ఉన్న వాట్సాప్ గ్రూప్‌లోని చివరి మూడు మెసేజ్‌లు చూపించమని అడగగానే ఫోన్ మర్చిపోయానంటూ కవర్ చేశారు. ‘‘శర్వానంద్ గురించి చెప్పాలంటే నేను చాలా నమ్మగలిగిన స్నేహితుడు’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు చరణ్. ‘‘చరణ్ చేసే సాయం ఎలా ఉంటుందంటే సాయం అందుకున్న వాడికి కూడా సాయం చేస్తాడని తెలియదు’’ అంటూ రామ్ చరణ్ గురించి గొప్పగా చెప్పాడు శర్వానంద్. మొత్తానికి రామ్ చరణ్‌కు సంబంధించిన పార్ట్ 2 ఎపిసోడ్ జనవరి 17 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×