Kuberaa Public Talk : కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల (Shekhar Kammula) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జూన్ 20వ తేదీన విడుదల అయింది. రష్మిక మందన్న (Rashmika mandanna) హీరోయిన్ గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ కీలకపాత్ర పోషించారు. శేఖర్ కమ్ముల అమీగోస్ క్రియేషన్స్ తో ఎస్వీసీఎల్ఎల్పీ బ్యానర్ పై సునీల్ నారంగ్ , పుష్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ్ , హిందీ, కన్నడ, మలయాళం భాషలో విడుదలైంది. ఇకపోతే ఈరోజు ఉదయమే షో థియేటర్లలో పడగా.. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. మరి సినిమా చూసిన పబ్లిక్ కుబేర సినిమాపై ఎలాంటి రివ్యూ ఇస్తున్నారు అనే విషయం ఇప్పుడు చూద్దాం..
కుబేర పబ్లిక్ టాక్..
సినిమా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.అత్యంత ధనవంతుడికి.. ఏమీ ఆశించని బిచ్చగాడికి మధ్య సాగిన కథ ఈ కుబేర. ఇందులో ధనుష్ చాలా అద్భుతంగా నటించారని ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ధనుష్ ఎంట్రీ సీన్ పట్ల చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ధనుష్ మాత్రమే చేయగలిగే పాత్ర ఇది అని, ఈ పాత్ర ఆయన కెరియర్లో చిరస్మరణీయం అని కూడా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు బిచ్చగాడి పాత్రలో జీవించేసిన ధనుష్.. కథకు కొత్త ప్రాణం పోశారు అని, తమ అభిప్రాయాలుగా వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రత్యేకంగా శేఖర్ కమ్ముల గురించి కూడా చెప్పుకోవాలి. మంచి డైరెక్షన్ తో పాటు డైలాగ్స్ అదిరిపోయేలా రూపొందించారు. స్క్రీన్ ప్లే ఎక్సైట్మెంట్ గా సాగుతుంది అంటూ చెబుతున్నారు.
సినిమాకు ప్రాణం పోసిన ధనుష్..
రష్మిక విషయానికి వస్తే.. మరొకసారి తన టాలెంట్ ను ప్రూవ్ చేసిందని, పాత్రకు ప్రాణం పోసిందని, ఇందులో కీ రోల్ పోషించిందని, రష్మిక నటనపై కూడా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ధనుష్ కి ఈ సినిమా ప్లస్ అవుతుందని కానీ నాగార్జునకే మైనస్ అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే నాగార్జునకు ఈ సినిమాలో అత్యంత బలంగా ఉండే పాత్ర దక్కిందని.. ఈ సినిమాలో ఆయన తన పాత్రతో అదరగొట్టేసారని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. మరికొంతమంది మాత్రం ఆయనకు బలమైన పాత్ర దక్కింది కానీ ఆయనను చూపించిన తీరు నెగిటివ్ గా మారిందని ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.
అదరగొట్టేసిన దేవిశ్రీప్రసాద్..
ఇంకా దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉందని, ప్రతి పాత్రకు ఆయన ప్రాణం పోశారని, బీజీఎం అదిరిపోయిందని చెబుతున్నారు. అయితే సినిమా అంతటా బ్లాక్ బస్టర్ అంటూ పోస్ట్లు చేస్తున్నారు. అంతా బాగున్నప్పటికీ ఫస్ట్ హాఫ్ కాస్త ల్యాగ్ గా అనిపించింది అని చెబుతున్నారు. అంతేకాదు ప్రేక్షకులు ఈ సినిమాకు ఏకంగా 10కి 9.5 రేటింగ్ కూడా ఇస్తూ ఉండడం గమనార్హం మొత్తానికైతే కన్నీళ్లు తెప్పించే సీన్లు ఉన్నాయని, ధనుష్ అభిమానులు కచ్చితంగా ఎమోషనల్ అవుతారని , కుబేర సినిమాకి కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని, అందులో ధనుష్ పాత్రకు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు గ్యారెంటీ అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Suriya 45: సూర్య కొత్త మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్.. వేట కొడవళ్లతో ఆట మొదలు!