
Upcoming Movie Releases : ఈ వారం చాలా సినిమాలు విడుదలకాబోతోంది. చిన్న మూవీస్ థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ చిత్రాలు ఏంటో తెలుసుకుందాం.
మార్టిన్ లూథర్ కింగ్..
సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. పూజ కొల్లూరు దర్శకురాలు. తమిళంలో విజయం సాధించిన ‘మండేలా’ చిత్రానికి రీమేక్ ఇది. ఈ సినిమా అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. వి.కె.నరేశ్,వెంకటేశ్ మహా, శరణ్య ప్రదీప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఓటు..
హృతిక్ శౌర్య, తన్వి నేగి జంటగా రవి తెరకెక్కించిన చిత్రం ‘ఓటు’. చాలా విలువైనది.. అన్నది ఉపశీర్షిక. ఫ్లిక్ నైన్ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. ఇది అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.‘ఓటు విలువ చెబుతూనే కమర్షియల్ టచ్ ఇచ్చిన కథ ఇది. తప్పకుండా అన్ని వర్గాలకూ నచ్చుతుందని దర్శకుడు తెలిపారు.
ఘోస్ట్ ..
కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ నటించిన తాజా చిత్రం ‘ఘోస్ట్’. శ్రీని దర్శకుడు. దసరా కానుకగా కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్టోబర్ 27న తెలుగులోనూ రానుంది. ‘ఆసక్తికరమైన యాక్షన్ థ్రిల్లర్ కథతో రూపొందిన చిత్రమిది. స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’ అని చిత్ర బృందం చెబుతోంది.