Pawan Kalyan OG :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. ఆయన మేనరిజంలోనే కాదు పేరులోనే ఏదో స్టైల్ ఉందని అభిమానులు కామెంట్లు చేస్తూ ఉంటారు. అటు సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ అంటే ఎనలేని అభిమానం చూపిస్తూ ఉంటారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ తెరపై కనిపించి చాలా కాలం అవుతోంది. అయినప్పటికీ కూడా అభిమానులలో ఆయనపై అభిమానం మరింత పెరిగిందే కానీ ఏమాత్రం తగ్గలేదు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా.. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు..ఇక ఒకవైపు రాజకీయాలలో బిజీగా పవన్ కళ్యాణ్ మరొకవైపు ‘ఓజీ’, ‘హరిహర వీరమల్లు’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ లో ఓజీ రిలీజ్..
అయితే ఇందులో దర్శకుడు సుజీత్ (Sujeeth ) తెరకెక్కిస్తున్న ఓజీ సినిమాని పవన్ కళ్యాణ్ ఎంత వేగంగా కంప్లీట్ చేశారో.. ఇప్పుడు అంతే గ్యాప్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన డేట్స్ కోసం మేకర్స్ కూడా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనేది మాత్రం అంతు చిక్కడం లేదు. అటు అభిమానులు కూడా ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ నుంచి వచ్చే సినిమా రిలీజ్ అయితే మాత్రం ఆ సినిమా నిర్మాతలకు కచ్చితంగా అదృష్టం వరించనుంది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ చిత్రాన్ని గత ఏడాది సెప్టెంబర్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ మిస్ అయింది. ఇక ఈ ఏడాదిలో కూడా అదే నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఆ టైమ్ అయినా ఈ చిత్రానికి వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.
Singer Chinmayee: బాధ్యత మీదే… ఆడపిల్లలపై చిన్మయి సంచలన ట్వీట్..!
ఓజీ టీజర్ రిలీజ్ పై క్రేజీ న్యూస్..
ఇలాంటి సమయంలో ఈ సినిమా నుండి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే ఈ సినిమా టీజర్ ని ఈ ఏప్రిల్ నెలలోనే మేకర్స్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ వార్త మరింత ఆనందాన్ని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు.. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజి మూవీకి సంబంధించిన ఈ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే..” అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాలతో భారీ విజయాన్ని అందుకొని స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నారు. ఇక సినిమాలలో ఉంటూనే రాజకీయ రంగంలోకి అడుగు పెట్టిన ఆయన.. ఎన్నో కష్టాలు పడి నేడు ఆంధ్రప్రదేశ్కి డీసీఎం గా బాధ్యతలు చేపట్టారు. ఇక ఇప్పుడు ఆడియన్స్ ని మెప్పించడానికి సినిమాలు కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అటు ప్రజల గురించి ఇటు అభిమానుల గురించి ఆలోచిస్తూ రెండు పడవల పైన ప్రయాణం చేస్తూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు .