Manchu Manoj : దాదాపు 9 ఏళ్ల తర్వాత మంచు మనోజ్ (Manchu Manoj) మళ్లీ తెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే మంచు మనోజ్ తాజాగా విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘భైరవం’. భారీ అంచనాల మధ్య మే 30వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో నారా రోహిత్ (Nara Rohit) తో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) హీరోలుగా నటిస్తున్నారు.. గుడి, ముగ్గురు స్నేహితుల చుట్టూ సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మే 18వ తేదీన ఏలూరులో ఘనంగా ఈవెంట్ నిర్వహించి, ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మరోవైపు అటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటు మంచు మనోజ్ ఇద్దరూ కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్ కార్యక్రమాలు పూర్తి చేసే పనిలో పడ్డారు.
కులం మారిన మనోజ్.. ఇప్పుడు ఏ కులం అంటే..
ఈ క్రమంలోనే ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసిన మంచు మనోజ్.. అందులో కులం గురించి మాట్లాడారు. తాను కులం మారానని, ఈ 2025లో కూడా కులం గురించి ప్రశ్నించడం ఏంటి? అంటూ మంచు మనోజ్ కామెంట్లు చేశారు. మనోజ్ మాట్లాడుతూ.. ‘భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ విజయ్ కనకమేడల పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. “విజయ్ కనకమేడల ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చేసిన కామెంట్లు ట్రోల్స్ కి గురయ్యాయి. కానీ ఆయన చేసిన మాటలు స్పష్టంగా వింటే నెగిటివ్ గా అనిపించవు. పవన్ కళ్యాణ్ అంటే విజయ్ కి ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు. ఆయన డీపీ కూడా పవన్ కళ్యాణ్ ఫోటోనే ఉంటుంది. నాకు కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. వ్యక్తిగతంగా నేను కూడా ఆయనకు వీరాభిమానిని. ఈ మూవీలో నేను పవన్ కళ్యాణ్ అభిమానిగానే నటించాను.. ఎందుకంటే ఆయన అంత సంపాదించుకునే సమయంలో కూడా ఒక హార్డ్ పార్ట్ ఎంచుకున్నారు. అయితే పాలిటిక్స్ ను ఉద్దేశించి విజయ్ ఆ మాటలు మాట్లాడలేదు. ఒక అభిమానిగా మాత్రమే ఆయన గురించి మాట్లాడారు. నాకు చార్మినార్ అంటే ఇష్టం. అలాగని తాజ్ మహల్ అంటే ఇష్టం లేదని కాదు. అదేదో మిస్ ఫైర్ అయిపోయింది. ఆ తర్వాత క్యాస్ట్ అంటూ బయటకు వచ్చింది. వాళ్లది వాళ్లది ఒకటే కులం అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. 2025లో ఉన్నామండి..ఇంకా ఈ క్యాస్ట్ గొడవ ఏంటి. ఈమధ్య కాలంలో కూడా క్యాస్ట్ గురించి తీస్తున్నారు అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒకరకంగా చెప్పాలి అంటే అటు రాజకీయాలలోనూ ఇటు స్టూడెంట్స్ లో కూడా ఈ మధ్య కులం గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటున్నది.. స్టూడెంట్స్ కూడా చెప్పుకుంటున్నది మన కులం ప్రేమికులం. నేనొక ప్రశ్న అడుగుతాను.. ప్రశాంత్ నీల్ ది ఏ కులం.. ఆయనను ఎందుకు మనం నెత్తిన పెట్టుకున్నాము. ఎక్కడో కర్ణాటక నుంచి వచ్చారు. ఇండస్ట్రీ ఒక టాలెంట్ ని మాత్రమే చూస్తుంది. కులాన్ని కాదు. అమితాబ్ బచ్చన్ ది ఏ కులం.. ఆయనను ఎందుకు ఆరాధిస్తున్నాము. షారుక్ ఖాన్ ది ఏ కులం.. కులం అనే మాట పక్కన పెట్టాలి.. అందరూ ఒకటే.. మనం ప్రేమికులం” అంటూ కామెంట్లు చేశారు మంచు మనోజ్. ఇది విన్న నెటిజన్స్ మనోజ్ కులం మారాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
డైరెక్టర్ పై ట్రోల్స్ రావడానికి కారణం..
ఇకపోతే విజయ్ కనక మేడల భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ.. “ధర్మాన్ని కాపాడడానికి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. సరిగ్గా గత ఏడాది క్రితం మన రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడానికి ఒకరు వచ్చారు” అంటూ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి డైరెక్టర్ కామెంట్లు చేశారు. దీంతో వైసిపి నేతలు మండిపడ్డమే కాకుండా బాయ్ కాట్ భైరవం అంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో కులం అంటూ చర్చకు రాగా ఈ కులంపై మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు.
ALSO READ:Akshay Kumar : మూవీ నుంచి తప్పుకున్న నటుడు.. వడ్డీతో సహా కక్కించేసిన అక్షయ్ కుమార్!