BigTV English

Daaku Maharaaj: ‘దబిడి దిబిడి’ కాంట్రవర్సీ పై ఊర్వశి రౌతేలా షాకింగ్ రియాక్షన్..

Daaku Maharaaj: ‘దబిడి దిబిడి’ కాంట్రవర్సీ పై ఊర్వశి రౌతేలా షాకింగ్ రియాక్షన్..

Daaku Maharaaj: నందమూరి హీరో బాలయ్య  సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ మధ్య కొన్నేళ్లుగా వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ అనే మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుము వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని అందుకుంది. డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో ఈ మూవీ తెరకెక్కింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.. ఈ సినిమాలో ఊర్వశీ రౌతేలతో బాలయ్య ఐటెమ్ సాంగ్‌లో మాస్ సెప్పులేయడం కాంట్రవర్సీగా మారింది. తాజాగా ఈ వివాదంపై ఊర్వశీ రౌతేల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి..


డాకు మహారాజ్ ఐటమ్ సాంగ్.. 

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ‘డాకు మహారాజ్’ సినిమా సక్సెస్ కావడంతో ‘దబిడి దిబిడి’ ఐటెం సాంగ్ హైలెట్ గా నిలిచింది. ఈ సాంగ్ కూడా సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేసిందో స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.. అయితే ఇందులో బాలయ్య, ఊర్వశి మధ్య స్టెప్పులు కాంట్రవర్సీ అయ్యాయి. బాలయ్య కూతురు వయసున్న హీరోయిన్ ను కొట్టడం స్టెప్ పెద్ద వివాదంగా మారింది. ఆ స్టెప్ ను కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ విమర్శలు అందుకున్నాడు.. తాజాగా ఈ వివాదం పై బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పందించింది. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది.. ఈ సాంగ్ పై వస్తున్న విమర్శల పై స్పందించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అవి ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.


ఊర్వశి రౌతేలా ఏమన్నారంటే..? 

డాకు మహారాజ్ ఐటమ్ సాంగ్ పై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. ఈ వార్తల పై ఆమె స్పందించారు. ఊర్వశి మీడియాతో మాట్లాడుతూ.. ఒక సినిమా విజయం సాధించినప్పుడు దానిపై విభిన్న అభిప్రాయాలు రావడంతో పాటు విమర్శలు రావడం కామన్.. వాటన్నిటిని తాను అర్థం చేసుకోగలనని పేర్కొంది.. అంత పెద్ద స్టార్ హీరోతో డ్యాన్స్ వెయ్యడం నాకు చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఇదంతా నటనలో భాగమేనని అంత పెద్ద స్టార్ హీరో బాలయ్య తో నటించిన కేవలం పర్ఫామెన్స్ కాదు.. బాలయ్యపై ఉన్న గౌరవమేనని, ఆయనతో నటించడం నా కల అని ఆమె పేర్కొన్నది.. డాకు మహారాజ్ సినిమాతో నెరవేరిందని, ఆయనతో నటించడం అదృష్టమన్నారు. ఆయన తనతో నటించేవారికి ఎంతో సపోర్ట్ ఇస్తారని ప్రశంసలు కురిపించింది. అలాగే దబిడి దిబిడి సాంగ్ ట్రోల్స్ పై కూడా స్పందించారు. జీవితంలో ఏం సాధించలేని వారు.. కష్టపడి పని చేసే వారిని విమర్శించే అర్హత ఉండదన్నారు. సాంగ్ ను బూతద్దం లో పెట్టి చూడటం తప్పు.. పాటను పాటలాగా చూడాలి అని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×