Vijay Setupathi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక హీరోకు అందం, బాడీ అవసరం లేదు అని నిరూపించిన హీరోల్లో విజయ్ సేతుపతి ముందు ఉంటాడు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ను మొదలుపెట్టిన ఆయన.. అందరి హీరోల రొటీన్ కథలను కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకొని స్టార్ హీరోగా మారాడు. ఇక స్టార్ గా మారాను కదా.. కేవలం హీరో పాత్రలే చేయాలి అని కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేయడం మొదలుపెట్టాడు.
హీరోగా, విలన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా .. ఇలా పాత్ర ఏదైనా కానీ, విజయ్ దిగనంతవరకే.. ఒక్కసారి ఆ పాత్రలోకి దిగడాంటే సినిమా హిట్ అవ్వాల్సిందే. పిజ్జా, నేను రౌడీనే, మహారాజా, ఉప్పెన, మాస్టర్, విక్రమ్.. ఈ సినిమాల్లో విజయ్ నటనకు ఫిదా కానీ ప్రేక్షకులు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇక సినిమాల్లోనే కాదు బయట కూడా విజయ్ వ్యక్తిత్వానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అభిమానులను సొంత కుటుంబ సభ్యులుగా ట్రీట్ చేసే ఆయన తీరుకు నెటిజన్స్ బ్రహ్మరథం పడుతుంటారు.
అలాంటి విజయ్ సేతుపతిని.. మరో స్టార్ హీరో అరవింద్ స్వామి హేళన చేశాడు. మరీ ఈ పదం పెద్దదిగా ఉంటే.. సింపుల్ గా టీజ్ చేశాడు. గలాటా నిర్వహించిన పాన్ ఇండియా హీరోల రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రకాష్ రాజ్, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, ఉన్ని ముకుందన్, సిద్దు జొన్నలగడ్డ పాల్గొన్నారు. ఇక ఈ సమావేశంలో సినిమాలు, నటన, దర్శకత్వం, షూటింగ్ , ప్రేక్షకులు ఇలా ఒక్కో టాపిక్ గురించి తమ అభిప్రాయాలను తెలుపుతూ వచ్చారు.
Saif Ali Khan: ఖరీదైన కార్లు పెట్టుకొని సైఫ్ ను ఆటోలో తీసుకొచ్చిన కొడుకు.. ఎందుకో తెలుసా.. ?
ఇక హీరోల యాక్టింగ్ గురించి విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ” ఎవరైనా మంచిగా యాక్టింగ్ చేస్తే నేను చాలా అభద్రతాభావానికి గురవుతాను. అరే ఇంత ఈజీగా ఎలా చేసేశారు.. ? అని ఆలోచిస్తూ ఉంటాను” అని సీరియస్ గా మాట్లాడుతుంటే.. పక్కన కూర్చున్న అరవింద్ స్వామి.. ప్రకాష్ రాజ్ ను చూసి.. చూసావా ఎలా చెప్తున్నాడో అన్నట్లు నవ్వాడు . దీంతో ప్రకాష్ రాజ్ సైతం నవ్వాడు. ఇక ఇది చూసిన విజయ్.. అరవింద్ స్వామిపై ఫైర్ అయ్యాడు. ” సార్.. ఈయన వలన ఇంటర్వ్యూ మొత్తం పాడైపోతుంది. ముందు ఈయన్ను బయట నిలబెట్టండి. ఇప్పుడే కాదు ఎప్పుడు నన్ను టీజ్ చేస్తూనే ఉంటాడు. రాత్రి సిట్టింగ్ కు రమ్మంటాడు. వెళ్లాను అంటే అక్కడ కూడా నన్ను టీజ్ చేస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు తెల్లార్లు అదే పని చేస్తాడు ” అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే ఇది వారిద్దరి మధ్య స్నేహంఎప్పటిదో కాబట్టి. అది అందరికీ వారు జోక్ చేసుకుంటున్నారు అని తెలిసిపోయింది. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి కలిసి నవాబ్ సినిమాలో నటించారు. అందులో వీరిద్దరూ ఫ్రెండ్స్ గా నటించారు. అప్పటినుంచే వీరిద్దరి మధ్య స్నేహం బలపడింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు.. అరబింద్ స్వామి బ్యాక్ బెంచర్ అనుకుంటా అని కొందరు.. హేళన చేయకు బ్రో అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.