Weight Loss Tips: ఆహారపు అలవాట్ల పరంగా చలికాలం చాలా మంచి సీజన్‌గా అనే చెప్పాలి. ఈ సీజన్‌లో మనం కావాలంటే ఈజీగా బరువును పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఈ సీజన్‌లో తినడం, తాగడం మంచి అనుభూతిని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు చలికాలంలో ఉదయం నిద్రలేచిన వెంటనే నిమ్మరసంతో బ్లాక్ కాఫీ తాగితే మీ బరువు తగ్గించుకోవచ్చు. అప్పుడు మీరు బరువు పెరగడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు . ఈ రెమెడీని ట్రై చేయడం ద్వాారా మీరు ఈజీగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
ఉదయం నిద్ర లేవగానే బ్లాక్ కాఫీ తాగండి:
బ్లాక్ కాఫీ కొవ్వును తగ్గించడంలో సహాయకరంగా పరిగణించబడుతుంది . ప్రతిరోజు బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల మీకు వెంటనే ప్రయోజనం కలుగుతుంది. అంతే కాకుండా బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్ జీవక్రియను పెంచుతుంది. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది . మీరు బరువు పెరగడం గురించి ఆందోళన చెందుతుంటే మాత్రం మీరు పాలతో తయారు చేసిన కాఫీకి బదులుగా బ్లాక్ కాఫీని తీసుకోవడం మంచిది.
నిమ్మ, బ్లాక్ కాఫీ యొక్క ప్రయోజనాలు:
సరైన జీర్ణక్రియ:
నిమ్మ, బ్లాక్ కాఫీ రెండూ జీర్ణక్రియకు మంచివి. ఇవి మీ బరువును తగ్గించడంలో సహాయపడతాయి. బ్లాక్ కాఫీలో కేలరీలు ఉండవు. దీని వల్ల మీ బరువు తగ్గుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల మీ జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.
నిమ్మరసం మీ బరువు తగ్గించడంలో మేలు చేస్తుంది. నిమ్మలో విటమిన్ సి ఉండటం వల్ల ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా నిమ్మరసం తరుచుగా తీసుకోవడం బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే మీ శరీరంలోని కొవ్వును కూడా ఇది తగ్గిస్తుంది. బ్లాక్ కాఫీలో నిమ్మరసం వేసి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
Also Read: వీటితో.. ఎంతటి తలనొప్పి అయినా క్షణాల్లోనే మాయం
ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు బ్లాక్ కాఫీని సిద్ధం చేసుకోండి. దానికి కాస్త నిమ్మకాయ రసం కలపండి. బ్రేక్ ఫాస్టుకు ముందు ఈ కాఫీ త్రాగండి. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే బ్లాక్ కాఫీ ఎక్కువగా తీసుకోవడం అంతమంచిది కాదు.