Thalapathy 69: కోలీవుడ్‌లో విజయ్‌కు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. అందుకే తన ఫ్యాన్స్ అంతా తనను దళపతి అని పిలుచుకుంటారు. ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్‌తో మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ క్యారెక్టర్‌తో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు విజయ్. అందుకే తనను అభిమానించే వారి కోసం రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. కొన్నాళ్ల క్రితం సొంత పార్టీ కూడా అనౌన్స్ చేశాడు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పే సమయం వచ్చేసింది. దళపతి 69తో చివరిగా వెండితెరపై సందడి చేయనున్నాడు విజయ్. తాజాగా ఈ సినిమాలో విలన్‌గా నటించేది ఎవరో రివీల్ చేశాడు మేకర్స్.
కోలీవుడ్‌లో బిజీ
దళపతి 69లో ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఒకప్పుడు సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్న బాబీ డియోల్.. మధ్యలో కొన్నాళ్ల పాటు అసలు వెండితెరపై కనిపించలేదు. ‘యానిమల్’తో మళ్లీ ఫార్మ్‌లోకి రావడంతో బాలీవుడ్ మాత్రమే కాదు.. సౌత్ నుండి కూడా ఆయనకు విపరీతమైన ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే సూర్య హీరోగా తెరకెక్కిన ‘కంగువా’లో విలన్‌గా నటించిన బాబీ.. ఇప్పుడు దళపతి 69లో కూడా ఛాన్స్ కొట్టేశాడు. అంతే కాకుండా మరెందరో తమిళ మేకర్స్ కూడా బాబీ డియోల్‌నను తమ సినిమాల్లో క్యాస్ట్ చేైసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కోలీవుడ్‌లో కూడా ఈ బాలీవుడ్ స్టార్ బిజీ కానున్నాడు.
Also Read: గోవిందా.. గోవిందా.. పవన్ పని గోవిందా.. పూనమ్ ట్వీట్ వైరల్
సోషల్ మీడియాలో టాక్
దళపతి 69లో బాబీ డియోల్ మాత్రమే కాదు.. ప్రకాశ్ రాజ్, ప్రియమణి లాంటి నటీనటులు కూడా ఉన్నట్టు కోలీవుడ్‌లో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఈ విషయం కన్ఫర్మ్ అవ్వాలంటే ఇంకా రెండురోజులు ఆగాల్సిందే. మొత్తం మూడు రోజుల పాటు దళపతి 69లో కీలక పాత్రలు పోషించే యాక్టర్స్ గురించి రివీల్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ ఇంతలోనే ఈ సినిమాకు సంబంధించి పలు గాసిప్స్ కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో హీరోయిన్‌గా నటించడానికి పూజా హెగ్డే సెలక్ట్ అయ్యిందని కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. తనతో పాటు మాలీవుడ్ బ్యూటీ మమితా బైజు కూడా దళపతి 69లో భాగం కానుందని తెలుస్తోంది.
‘ది గోట్’ హిట్
విజయ్ చివరిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది గోట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా విడుదలయ్యి దాదాపు నెల రోజులు అవుతున్నా కూడా ఇంకా పలు థియేటర్లలో ‘ది గోట్’ రన్ అవ్వడం విశేషం. ఈ మూవీని తమిళంతో పాటు తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదలయ్యింది. కానీ కేవలం తమిళంలో మాత్రమే ‘ది గోట్’కు బ్లాక్‌బస్టర్ టాక్‌తో పాటు అదే రేంజ్‌లో కలెక్షన్స్ కూడా వచ్చాయి. హిందీ, తెలుగులో మాత్రం ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇప్పుడు దళపతి 69తో మరో హిట్ కోసం సిద్ధమయ్యాడు విజయ్. హెచ్ వినోథ్ దర్శకత్వంలో వెంకట్ కే నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
100% official now, Super happy & excited to announce that @thedeol joins #Thalapathy69 cast 🔥#Thalapathy69CastReveal#Thalapathy @actorvijay sir #HVinoth @anirudhofficial @Jagadishbliss @LohithNK01 pic.twitter.com/KKCfaQZtON
— KVN Productions (@KvnProductions) October 1, 2024