VaraLaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్ కుమార్.. తమిళ నటి అయినా కూడా తెలుగులో బిజీగా ఉంటుంది. తెలుగులోనే ఆమె క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. త్వరలోనే యశోద చిత్రంలో ఓ కీలక పాత్రతో మెప్పించనుంది. మరో వైపు నందమూరి బాలకృష్ణ 107వ చిత్రం వీర సింహా రెడ్డిలోనూ ఇంపార్టెంట్ రోల్‌లో నటిస్తోంది. ఈ అమ్మడు తన రీసెంట్ ఇంటర్వ్యూలోపెళ్లి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘‘ప్రస్తుతం నాకు పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నా సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాను. ఎప్పుడో చేసుకుంటానో ఇప్పుడే చెప్పలేను’’ అన్నారు వరలక్ష్మి. ఇప్పటికే మూడు పదులు దాటేసిన ఈ అమ్మడు ఇక పెళ్లెప్పుడు చేసుకుంటుందో తెలియటం లేదు. NBK 107 పక్కా మాస్ కంటెంట్‌తో ఫ్యాన్స్‌ని,ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.
కెరీర్ ప్రారంభంలో హీరోయిన్‌గా వరుస సినిమాలు చేసిన శరత్ కుమార్ ముద్దుల తనయ.. హీరో విశాల్‌తో ప్రేమాయణం నడిపింది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఏమైందో ఏమో తెలియదు. ఇద్దరి మధ్య బ్రేకప్ అయ్యింది. ఇప్పుడు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. విశాల్ తర్వాత ఓ అమ్మాయితో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. తీరా పెళ్లి పీట లెక్కలేదు.