BigTV English
Advertisement

Anil Ravipudi – F4: ‘ఎఫ్ 4’ కు రంగం సిద్ధం.. త్వరలోనే సెట్స్ పైకి కామెడీ మూవీ..!

Anil Ravipudi – F4: ‘ఎఫ్ 4’ కు రంగం సిద్ధం.. త్వరలోనే సెట్స్ పైకి కామెడీ మూవీ..!

F4 Coming Up On The Sets Soon: టాలీవుడ్‌లో ఈ మధ్య మల్టీస్టారర్ సినిమాలకు సూపర్ డూపర్ క్రేజ్ వస్తుంది. ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తూ మంచి హిట్లను అందుకుంటున్నారు. ఒకప్పుడు ఈ తరహా సినిమాలు వచ్చినా ప్రేక్షకులు పెద్దగా ఆదిరించేవారు కాదు. కానీ ఈ మధ్య యంగ్ హీరోలు చేస్తున్న సినిమాలకు మాత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది. అందులో ఈ మధ్య వచ్చిన సినిమాల్లో బీమ్లా నాయక్, వాల్తేరు వీరయ్య, ఆర్ఆర్ఆర్ సహా మరికొన్ని కామెడీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్లను అందుకున్నాయి.


అందులో ‘ఎఫ్ 2’ మూవీ కూడా ఒకటి. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ – యంగ్ హీరో వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో భారీ రెస్పాన్స్‌తో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో వెకంటేష్, వరుణ్ తేజ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

అల్లరి అల్లరి చేస్తూ సినీ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని కడుపుబ్బా నవ్వించేశారు. ఈ మూవీతో అటు వెంకీ, ఇటు వరుణ్‌తో సహా దర్శకుడు అనిల్ రావిపూడి పేర్లు మారుమోగిపోయాయి. ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు భారీ లాభాల పంట పండింది. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్‌ల సరసన తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్‌లుగా నటించి మెప్పించారు.


Also Read: నాని ‘గరం గరం’ సాంగ్ అదుర్స్.. మాస్ యాక్షన్‌తో దుమ్ముదులిపేశాడు

ఈ మూవీ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సాధించడంతో దర్శకుడు ‘ఎఫ్ 3’ పేరుతో మరో సినిమా తెరకెక్కంచాడు. ఈ మూవీ కూడా మరింత కామెడీ ఎలిమెంట్స్‌తో ఆడియన్స్‌ను పలకరించింది. ఇందులో డబ్బు కోసం వారు పడే కష్టాలను చూపిస్తూ దానికి కామెడీ అటాచ్ చేసిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. అయితే ఫస్ట్ పార్ట్ అంత రెస్పాన్స్ రాకపోయినా.. ఓ మోస్తరు విజయం అయితే సాధించిందనే చెప్పాలి.

ఇక ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మరో మూవీ తెరకెక్కడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సారి ‘ఎఫ్ 4’గా ప్రేక్షకుల్ని పలకరించేందుకు రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించిన విషయాన్ని నిర్మాత దిల్ రాజు తాజాగా తెలిపాడు. ఈ మూవీ ఫ్రాంచైజ్‌ను కొనసాగిస్తామని తెలిపాడు. దీంతో ‘ఎఫ్4’కు రంగం సిద్ధం అయినట్లు క్లారిటీ వచ్చింది. అయితే ఈ మూవీలో వెంకటేష్, వరుణ్ తేజ్‌తో పాటు మరో స్టార్ హీరో కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×