BigTV English

Papaya Seeds Benefits: బొప్పాయి గింజలు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Papaya Seeds Benefits: బొప్పాయి గింజలు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
Advertisement

Amazing Health Benefits of Papaya Seeds: బొప్పాయి పండు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మనందరికి తెలుసు. కాని బొప్పాయి తిని అందులోని గింజలు మాత్రం పారేస్తూ ఉంటారు. ఇక నుంచి అలా చేయకండి. అందులో చాలా ఔషదగుణాలు ఉన్నాయట. బొప్పాయి గింజలు కొంచెం చేదుగా ఉంటాయి. కానీ ఈ గింజల్లో మాత్రం అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి.


వీటిని తినడం వల్లన అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. బొప్పాయి గింజలను నేరుగా తినలేం కాబట్టి వాటిని ఎండబెట్టి, మెత్తగా పొడి తయారు చేసుకొని ఆహార పదార్ధాలు తినేటప్పుడు గాని, స్మూతీస్, సలాడ్లు, ఇతర వంటకాల రూపంలో తీసుకోవచ్చు. విత్తనాలు కొద్దిగా మిరియాలు రుచిని కలిగి ఉంటాయి కాబట్టి మసాలాగా ఉపయోగించవచ్చు. ఇది శరీరాన్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది.

1- బొప్పాయి గింజలు జీవక్రియను పెంచుతుంది. బొప్పాయి ఇతర పండ్ల కంటే తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పండిన బొప్పాయి గింజలను పేస్ట్ లా చేసి నీళ్లలో కలుపుకొని త్రాగవచ్చు.


2- ఇది శరీరంలో మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. బొప్పాయి గింజలు తీసుకోవడం వల్లన UV కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. ముడతలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

3- బొప్పాయి గింజలు, ఆకులలో ఉండే కార్పెంటైన్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది కడుపు  వ్యాధులను నయం చేస్తుంది.

4- ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

Also Read: కొరియన్ల మాదిరిగా మెరిసే చర్మాన్ని పొందాలనుకుంటున్నారా? ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి..

5- పండిన బొప్పాయి గింజలు తినడం వల్ల శరీరంలోని విష పదార్థాలు తొలగిపోతాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

6- పండిన బొప్పాయి గింజలు డయాబెటిస్‌లో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.

అతి పెద్ద విషయం ఏమిటంటే, బొప్పాయి గింజలను రోజూ తింటే శరీర బరువు, షుగర్, జీర్ణ సమస్యలు, గుండె సమస్యలు తగ్గుతాయి.

Related News

Garlic: చలికాలంలో వెల్లుల్లి ఎక్కువగా తింటే.. నమ్మలేనన్ని ప్రయోజనాలు !

Intimacy Boost: ఏంటీ.. చలికాలంలో ఆలుమగలు అలా కలిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందా? సైన్స్ ఏం చెబుతోందంటే?

Waking Up: మధ్య రాత్రి మెలకువ వస్తోందా? అసలు కారణాలివే !

Breakfasts: మార్నింగ్ ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ తింటే.. రోజంతా ఫుల్ ఎనర్జీ

Soan papdi Sweet: ఓడియమ్మ.. దీపావళికి సోన్ పాపిడి గిఫ్ట్ ఇవ్వడానికి కారణం ఇదేనట!

Spinach: పాలకూరతో పాటు.. ఇవి అస్సలు తినొద్దు !

Health Risks: పండగ సమయంలో నోటిని అదుపు చేసుకోలేకపోతున్నారా ? ఇలా చేయకుంటే సమస్యలు తప్పవు

Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ తగ్గించే.. బెస్ట్ ఫుడ్స్ ఏంటో తెలుసా ?

Big Stories

×