OTT Movie : థియేటర్లలోకి కొత్త కొత్త స్టోరీలు తీసుకొస్తూనే ఉన్నారు దర్శకులు. అయితే వీటిలో హారర్ కంటెంట్ తో వచ్చే సినిమాలు చూడటానికి ప్రేక్షకులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ, మానసిక రోగంతో బాధపడే ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీలో దారుణమైన సైకో సీన్స్ ఉంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ హారర్ డ్రామా మూవీ పేరు ‘ది స్టైలిస్ట్’ (The Stylist). 2020 లో వచ్చిన ఈ మూవీకి జిల్ గెవర్గిజియన్ రచన చేసి, దర్శకత్వం వహించి, నిర్మించారు. ఇది ఆమె 2016లో తీసిన, అదే పేరుతో ఉన్న షార్ట్ ఫిల్మ్ ఆధారంగా రూపొందింది. నజర్రా టౌన్‌సెండ్, బ్రియా గ్రాంట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మిస్సోరీ సిటీ లో జరుగుతుంది. ఒంటరితనంతో బాధపడే ఒక మహిళ, మానసికంగా ఒక గుర్తింపు కోసం అన్వేషిస్తుంది. ఈ క్రమంలో ఒక భయంకరమైన దారిని ఎంచుకుంటుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
క్లైర్ ఒక హెయిర్‌స్టైలిస్ట్ గా పని చేస్తుంటుంది. ఆమె రోజువారీ జీవితంలో ప్రొఫెషనల్ హెయిర్‌స్టైలిస్ట్ గా పనిచేస్తుంది. కానీ ఆమెలో ఒక చీకటి కోణం కూడా దాగి ఉంటుంది. ఆమె తన క్లయింట్‌లను రహస్యంగా హత్య చేసి, వారి తలలోని స్కాల్ప్‌లను సేకరిస్తుంది. ఈ స్కాల్ప్‌లను ఆమె తన ఇంటి సెల్లార్‌లో భద్రపరుస్తూ, తన ఒంటరితనాన్ని ఎదుర్కోవడానికి ఒక మార్గంగా ఉపయోగిస్తుంది. క్లైర్ తన జీవితంలో అసంతృప్తితో ఉంటుంది. ఇతరుల జీవితాలపై ఆసక్తి కలిగి ఉంటుంది. దీని కారణంగా ఆమె తన క్లయింట్‌ల స్కాల్ప్‌లను ధరించి వారిలా నటిస్తూ ఒక సైకోలా ప్రవర్తిస్తుంది. అయితే ఒకసారి, క్లైర్ రెగ్యులర్ క్లయింట్ తన పెళ్లి కోసం హెయిర్ స్టైలింగ్ చేయమని క్లైర్‌ను అడుగుతుంది. ఒలివియా జీవితం క్లైర్‌కు బాగా నచ్చుతుంది. దీనివల్ల ఆమె ఒలివియాపై తీవ్రమైన ఆకర్షణకు లోనవుతుంది. ఒలివియా స్నేహితులతో సరదాగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమెను చాలా మంది ఎగతాళి చేస్తారు.
ఇలా ఆమె బాధపడుతున్న తీరు క్లైర్‌ను ఆలోచనలో పడేస్తుంది. క్లైర్ తన హత్యా ప్రయత్నాలను మానుకోవడానికి ప్రయత్నిస్తుంది. తన స్కాల్ప్ సేకరణను లాక్ చేస్తుంది. కానీ దీనివల్ల ఆమె మానసిక స్థితి ఇంకా దిగజారుతుంది. చివరికి ఆమె తన కోరికలను అదుపు చేయలేక, ఒలివియాను హత్య చేస్తుంది. క్లైర్ ఒలివియా స్కాల్ప్, డ్రెస్‌ను ధరించి, పెళ్లి వేదికపై ఒలివియాగా నటిస్తూ వెడ్డింగ్ ఐల్‌లో నడుస్తుంది. అయితే, వరుడు ఆమె ముసుగును తొలగించినప్పుడు, అసలు విషయం బయట పడుతుంది. అతిథులు భయాందోళనలో పరుగెత్తుతారు. చివరికి క్లైర్ హత్యలను చేయడం మానుకుంటుందా ? ఆమె మానసిక స్తితి మెరుగుపడుతుందా ? ఈ విషయాలను తెలుసుకోవాలి అంటే, ఈ సినిమాను చూడాల్సిందే.
Read Also : పెళ్ళంటే పారిపోయే అమ్మాయి … మస్ట్ వాచ్ మలయాళం రొమాంటిక్ ఎంటర్టైనర్